Mangalsutra add : మంగళసూత్రం ప్రకటనపై సవ్యసాచికి హోంమంత్రి వార్నింగ్..

24 గంటల్లో మంగళసూత్రం యాడ్ ను ఉపసంహరించుకోవాలని డిజైన్ సబ్యసాచి ముఖర్జీకి మధ్యప్రదేశ్ హోంమంత్రి వార్నింగ్ ఇచ్చారు. మంత్రి వార్నింగ్ ఇవ్వటంతో యాడ్ ను ఉపసంహరించుకున్నారు డిజైనర్

Mangalsutra add : మంగళసూత్రం ప్రకటనపై సవ్యసాచికి హోంమంత్రి వార్నింగ్..

Mangalsutra Designer Sabyasachi Mukjerhee (1)

Mangalsutra Designer Sabyasachi Mukjerhee: ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సబ్యసాచి ముఖర్జీ మంగళసూత్రం ప్రకటతో చిక్కుల్లో పడ్డారు. తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన డిజైన్ చేసిన మంగళసూత్రం యాడ్ కాస్తా వివాదానికి దారితీయటంతో ట్రోలింగ్ కు గురయ్యారు డిజైనర్ సబ్యసాచి. ఆభరణాల డిజైనర్ గా సబ్యసాచికి మంచి పేరుంది. స్టైలిష్‌ డిజైనర్‌గా మంచి పేరున్న ఆయన కొన్ని రోజుల క్రితం ‘మంగళసూత్ర’ పేరుతో రూపొందించిన ఓ యాడ్‌ వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు ఈ యాడ్ పై మండిపడ్డారు. అది పవిత్రమైన మంగళసూత్రం యాడా?లోదుస్తుల యాడా? అని ఏకిపారేశారు. సబ్యసాచి డిజైన్ చేసిన మంగళసూత్రం ఎంత వివాదమైందంటే..సాక్షాత్తు హోంమత్రి మంత్రిగారే రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చేంత రచ్చ అయిపోయింది. దీంతో అనుకున్నది ఒక్కటి..అయినది ఒక్కటి అన్నట్లుగా పాపం డిజైనర్ సబ్యసాచి మంగళసూత్రం యాడ్ ను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది.

Read more :  Sabyasachi Mangalsutra : ఇది మంగళసూత్రం ప్రకటనా? లో దుస్తుల ప్రకటనా?! నెటిజన్ల ఫైర్

ఇంటిమేట్‌ఫైన్‌ జ్యూయల్లరీ థీమ్‌తో డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ఓ ‘మంగళసూత్రం’ డిజైన్ చేశారు. మంగళసూత్రం డిజైన్ బాగుందనే ప్రశంసలు కూడా వచ్చాయి. కానీ వచ్చిన చిక్కల్లా దాన్ని పబ్లిసిటీ చేయటానికి..చేసిన యాడ్ వల్లే వచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోషూట్‌పై తీవ్ర ఆగ్రహాలు వెల్లువెత్తాయి. పవిత్ర మంగళ సూత్రం కోసం ఇలాంటి ఫొటోషూట్‌ చేస్తావా’ అంటు పలువురు ప్రముఖులు సబ్యసాచిపై దుమ్మెత్తి పోశారు.

ఈ మంగళసూత్రం యాడ్ లో మంగళసూత్రాన్ని ధరించిన ఓ మహిళ అసభ్యకర రీతిలో ఉంది.అంటే శృంగార భంగిమల్లో అర్ధనగ్నంగా ఉంది. మరో ఫోటోలో స్వలింగ సంపర్కులు కూడా ధరించినట్టుగాను..అలాగే ఒంటరిగా ఉన్న మహిళలు కొందరు మంగళసూత్రంతో కనిపించింది. ‘‘రాయల్ బెంగాల్ మంగళసూత్ర 1.2 , బెంగాల్ టైగర్ ఐకాన్ సేకరణను పరిచయం చేస్తున్నాము, VVS డైమండ్స్, బ్లాక్ ఒనిక్స్ , బ్లాక్ ఎనామెల్‌తో 18k బంగారంతో నెక్లెస్‌లు, చెవిపోగులు , సిగ్నెట్ రింగ్‌ల సేకరణ” అందుబాటులో ఉన్నాయని ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఈ ప్రకటన వివాదాస్పదంగా మారింది. నెటిజన్లు దీనిపై విపరీతంగా ట్రోల్ చేశారు. మంగళసూత్రం పవిత్రతను దెబ్బతీశారంటూ సవ్యసాచిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

Read more : Rebecca Downie : T20 వరల్డ్ కప్ జెర్సీ డిజైన్ చేసిన 12 ఏళ్ల చిన్నారి

దీంతో ఈ విషయం కాస్తా మధ్యప్రదేశ్ మంత్రి హోం మంత్రి కూడా స్పందించారు. ఆయనకు లీగల్‌ నోటీసులు పంపారు. దీంట్లో భాగంగా మధ్యప్రదేశ్‌ హోం శాఖ మంత్రి నరోత్తమ్‌ మిశ్రా..24 గంటల్లోపు యాడ్‌ను ఉపసంహరించుకోవాలని అల్టిమేటమ్‌ జారీ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని..పోలీసులు బలగాలను కూడా పంపిస్తానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఓ వైపు ట్రోలింగ్, మరోవైపు మంత్రి అల్టిమేటంతో డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ప్రకటనను ఉపసంహరించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

తమ యాడ్‌పై వస్తోన్న విమర్శలపై స్పందించిన డిజైనర్‌ సంస్థ వివాదాస్పద ప్రకటనను ఉపసంహరించుకుంది. ‘వారసత్వం, సంస్కృతిని మరింత డైనమిక్‌ సంభాషణగా మార్చే క్రమంలో ఈ మంగళసూత్ర యాడ్‌ను రూపొందించామని..కానీ ఈ ప్రకటన సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలను కించపరిచేలా ఉందని తెలిసింది. ఇందుకు మేం చాలా బాధపడుతున్నాం. సబ్యసాచి ముఖర్జీ తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు’ అని డిజైనర్‌ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపింది.

Read more : ఒక ఉంగరంలో 7,801 వజ్రాలు.. హైదరాబాదీ గిన్నీస్ వరల్డ్ రికార్డు!