Cristiano Ronaldo Private Jet: రొనాల్డో ప్రైవేట్ జెట్ చూశారా..! ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేసిన జార్జినా

ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు, పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో ప్రైవేట్ జెట్‌కు చెందిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు.. బాబోయ్ జెట్ లోపల ఇంత లగ్జరీగా ఉంటుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Cristiano Ronaldo Private Jet: రొనాల్డో ప్రైవేట్ జెట్ చూశారా..!  ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేసిన జార్జినా

Cristiano Ronaldo

Updated On : January 3, 2023 / 1:33 PM IST

Cristiano Ronaldo Private Jet: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ క్రీడాకారుడు, పోర్చుగల్‌కు చెందిన క్రిస్టియానో రొనాల్డో పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తికాదు. ఫుట్ బాల్ క్రీడా ప్రపంచంలో రారాజుగా రొనాల్డో వెలుగొందుతున్నాడు. తాజాగా అతని ప్రైవేట్ జెట్‌కు చెందిన ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు.. బాబోయ్ జెట్ లోపల ఇంత లగ్జరీగా ఉంటుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Georgina Rodríguez (@georginagio)

ప్రస్తుతం రొనాల్డో తన స్నేహితురాలు జార్జినా రోడ్రిగ్జ్‌తో కలిసి సౌదీ అరేబియాలో ఉన్నాడు. ప్రత్యేక జెట్ లో జార్జినా, ఆమె ఐదేళ్ల కుమార్తె అనాలతో కలిసి రొనాల్డో సౌదీ వెళ్లారు. ఈ సమయంలో జార్జినా తన కుమార్తెతో ప్రైవేట్ జెట్‌లోని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.