Dil De Diya : జాక్వెలిన్‌తో కలిసి జాతర చేసిన సల్మాన్ ఖాన్..

‘రాధే’ – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్.. సినిమా ట్రైలర్‌‌తో ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చిన సల్లూ భాయ్.. ‘సీటీ మార్’ వీడియో సాంగ్‌తో డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో రచ్చ లేపాడు..

Dil De Diya : జాక్వెలిన్‌తో కలిసి జాతర చేసిన సల్మాన్ ఖాన్..

Dil De Diya

Dil De Diya: ‘రాధే’ – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్.. సినిమా ట్రైలర్‌‌తో ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చిన సల్లూ భాయ్.. ‘సీటీ మార్’ వీడియో సాంగ్‌తో డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు.. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో రచ్చ లేపాడు.. ‘వాంటెడ్’, ‘దబాంగ్ 3’ సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో వస్తున్న ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘రాధే’ – యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్..

RADHE

జీ స్టూడియోస్ సమర్పణలో సల్మాన్ ఖాన్ ఫిలింస్, సోహైల్ ఖాన్ ప్రొడక్షన్, రీల్ లైఫ్ ప్రొడక్షన్ ప్రై.లి. సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ట్రైలర్, ‘సీటీ మార్’ సాంగ్ అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచేశాయి.. శుక్రవారం ఈ సినిమాలో నుండి ‘దిల్ దేదియా’ అనే వీడియో సాంగ్ వదిలారు..

Seeti Maar : వావ్.. సల్మాన్ ‘సీటీ మార్’.. బన్నీ, డీఎస్పీలకు థ్యాంక్స్ చెప్పిన భాయ్ జాన్.. ప్రేయసితో పాడించాడుగా!

సల్లూ భాయ్ తన స్టైల్‌లో స్టైలిష్ స్టెప్స్ వెయ్యగా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కిరాక్ మూమెంట్స్‌తో అదరగొట్టేసింది.. ఫ్లోర్ మూమెంట్స్, డ్యాన్సర్, జాక్వెలిన్ లెగ్ పట్టుకున్నప్పుడు వేసిన మూమెంట్ సింప్లీ సూపర్బ్.. ఈ పాట బిగ్ స్క్రీన్ మీద ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌కి ఫుల్ కిక్కుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. సాంగ్ చివర్లో రణదీప్ హుడా మూన్ వాక్ హైలెట్ అని చెప్పాలి.. మే 13న థియేటర్లతో పాటు ఓటీటీలోనూ ఈ మూవీ విడుదలవుతోంది..