Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఊరించి ఉసూరుమనిపించిన ఓంరౌత్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నాడు. ‘రాధేశ్యామ్’ విడుదల తర్వాత మిగిలిన సినిమాలు కూడా ఫాస్ట్ గా రెడీ చేసేస్తున్నాడు. తన పాన్ ఇండియా..

Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఊరించి ఉసూరుమనిపించిన ఓంరౌత్

Adipurush

Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్నాడు. ‘రాధేశ్యామ్’ విడుదల తర్వాత మిగిలిన సినిమాలు కూడా ఫాస్ట్ గా రెడీ చేసేస్తున్నాడు. తన పాన్ ఇండియా సినిమాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. రామాయణం ఆధారంగా తీసుకొని ‘ఆదిపురుష్’ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించగా గుల్షన్ కుమార్, టి-సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Adipurush: డార్లింగ్ మేకోవర్ కష్టాలు.. వీ షేప్ బాడీ కోసం పడరాని పాట్లు!

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈమధ్యనే మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. సంక్రాంతి 2023 జనవరి 12న ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక.. ఈ సినిమా రామాయణ ఆధారంగా తెరకెక్కే సినిమా కావడంతో ఈ శ్రీరామ నవమికి మేకర్స్ నుండి ఏదైనా స్పెషల్ ట్రీట్ ఉంటుందని రెబల్ స్టార్ అభిమానులు ఆశపడ్డారు. సోషల్ మీడియాలో ఇదే విషయంపై కొద్ది రోజులు ఎదురుచూపులు కూడా కనిపించాయి.

Adipurush: విజువల్ పనుల్లో ఆదిపురుష్.. 3డీ కోసం ఫుల్ ఎఫర్ట్!

అయితే.. మేకర్స్ మాత్రం ప్రభాస్ అభిమానులను ఉసూరుమనిపించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏదో ఒక అప్డేట్ ఇస్తారని అభిమానులు ఆశించగా మళ్ళీ వారికి నిరాశే ఎదురైంది. కానీ, దానికి బదులుగా దర్శకుడు ఓంరౌత్ మరో ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు చెందిన ఫాన్స్ చేసిన ఎడిట్స్ నే ఒక వీడియోలా చేసి ఇంత ప్రేమ చూపిస్తున్న అభిమానులకి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశాడు. దీనిపై కొందరు అభిమానులు మండిపడుతున్నారు. కనీసం ఒక పోస్టర్ రిలీజ్ చేసినా బావుండేదని కామెంట్స్ చేస్తున్నారు.