Adipurush: డార్లింగ్ మేకోవర్ కష్టాలు.. వీ షేప్ బాడీ కోసం పడరాని పాట్లు!

ప్రభాస్ సినిమా వస్తుందంటే మా హీరో లుక్కెలా ఉంటుంది అన్న ప్రశ్నే.. ఆయన ఫ్యాన్స్ ను వెంటాడుతుంది. రాధేశ్యామ్ విషయంలో అదే జరిగింది. ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ను డిస్సప్పాయింట్ చేసింది.

Adipurush: డార్లింగ్ మేకోవర్ కష్టాలు.. వీ షేప్ బాడీ కోసం పడరాని పాట్లు!

Adipurush

Adipurush: ప్రభాస్ సినిమా వస్తుందంటే మా హీరో లుక్కెలా ఉంటుంది అన్న ప్రశ్నే.. ఆయన ఫ్యాన్స్ ను వెంటాడుతుంది. రాధేశ్యామ్ విషయంలో అదే జరిగింది. ప్రభాస్ లుక్ ఫ్యాన్స్ ను డిస్సప్పాయింట్ చేసింది. కానీ అభిమానులు రెచ్చిపోండి.. నెవర్ బిఫోర్ అవతార్ లో డార్లింగ్ ను చూడండి. మీ అంచనాలకు అందని విధంగా ఆదిపురుష్ వస్తున్నాడని డైరెక్టర్ ఓం రౌత్ చెప్తున్నాడు.

Adipurush: విజువల్ పనుల్లో ఆదిపురుష్.. 3డీ కోసం ఫుల్ ఎఫర్ట్!

మాస్, స్టైలిష్, పవర్ ఫుల్, రఫ్, రాయల్, లవర్ బాయ్.. ఇలా ప్రభాస్ లోని చాలా యాంగిల్స్ నే ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. కానీ అంతకుమించి అన్న లెవెల్ లో ఆదిపురుష్ రాబోతున్నాడని చెప్తున్నారు డైరెక్టర్ ఓం రౌత్. రిస్క్ తీసుకొని మరీ రామునిగా మారేందుకు ప్రభాస్ కష్టపడ్డారనేది డైరెక్టర్ వెర్షన్. ఆర్చరీలో ట్రైనింగ్ తీసుకున్న ప్రభాస్.. ఆర్చరీ ప్రాక్టీస్ చేసే వాళ్లలా వి షేప్ బాడీ మేకోవర్ కోసం కూడా సవాళ్లు స్వీకరించారని ఓం రౌత్ సీక్రెట్ రివీల్ చేశాడు.

Adipurush: క్రేజీ అప్డేట్.. ప్రభాస్ మరో సినిమాకు సీక్వెల్ సిద్ధం?

ఛత్రపతి నుంచి సాహో వరకు సినిమాకు అవసరమైనప్పుడల్లా బాడీ మేకోవర్ తో ఆడియెన్స్ ను ఫిదా చేశారు ప్రభాస్. సో సంక్రాంతికి రాబోతున్న ఆదిపురుష్ కోసం కూడా రాముడిగా పర్ఫెక్ట్ గా కనిపించేందుకు బాగానే కష్టపడ్డారు. చాలా తక్కువ టైమ్ లో తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసిన గ్లోబల్ స్టార్.. ఆ క్యారెక్టర్ కోసం మాత్రం చాలా కష్టపడినట్టు తెలుస్తోంది. భుజాలు బ్రాడ్ గా, నడుము భాగం సన్నగా.. టోటల్ గా వి షేప్ లో బాడీని మలుచుకోవడమే కాదు.. సంస్కృతాన్ని, హిందీని స్పష్టంగా పలికేందుకు కూడా ట్రైనింగ్ సెషన్స్ తీసుకున్నారు డార్లింగ్.

Adipurush : వచ్చే సంక్రాంతికి ‘ఆదిపురుష్’.. డేట్ ఫిక్స్ చేసిన ప్రభాస్

ప్రేక్షకుల ఊహకు అందలేనంతగా ఆదిపురుష్ సీన్స్ హైలైట్ అవబోతున్నాయని.. ఈ సినిమాలో.. రాముడి పరాక్రమ శైలి ప్రతిఒక్కరినీ మెప్పిస్తుందని.. `ఆది పురుష్` షూటింగ్ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేనన్నాడు ఓం రౌత్. ప్రభాస్ తో పాటూ సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్ తో వర్క్ చేయడం ఆనందంగా ఉందన్న డైరెక్టర్.. డౌన్ టు ఎర్త్ హీరో ప్రభాస్.. రాముడిగా పరకాయప్రవేశం చేసారని కితాబిచ్చారు. ఇక అంతా అనుకుంటున్నట్టు శ్రీరామనవమికి ఆదిపురుష్ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయితే ఫ్యాన్స్ ఆపడం కష్టమే.