Ram Gopal Varma : వరంగల్‌లో వర్మ సీక్రెట్ సెర్చింగ్.. వాళ్ల బయోపిక్ గురించేనా..?

కాంట్రవర్శీ కింగ్ రామ్ గోపాల్ వర్మ మరో పొలిటికల్ బయోపిక్ చెయ్యబోతున్నారా..?

Ram Gopal Varma : వరంగల్‌లో వర్మ సీక్రెట్ సెర్చింగ్.. వాళ్ల బయోపిక్ గురించేనా..?

Rgv

Updated On : September 24, 2021 / 7:42 PM IST

Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. తనలోని క్రియేటివిటీని ఎప్పుడో పక్కన పెట్టేసి క్రాంట్రవర్శీలతోనే కాపురం చేస్తున్నాడు. ఈమధ్య అషూ రెడ్డి, ఆరియానా గ్లోరీలకు బోల్డ్ ఇంటర్వూలు ఇచ్చి ఏ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడో తెలిసిందే.

Ashu Reddy : ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వూ.. అషు రెడ్డి వాళ్ల అమ్మ ఏం చెప్పిందంటే..

గతకొద్ది కాలంగా బోల్డ్ కంటెంట్ లేదా బయోపిక్స్‌తోనే సినిమాలు చేస్తున్న వర్మ ఇప్పుడు మరో క్రేజీ బయోపిక్‌కి రంగం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది. అందుకోసం ఆయన సీక్రెట్‌గా వరంగల్‌లో పర్యటించారు. కొండా సురేఖ – మురళి దంపతుల బయోపిక్ చెయ్యడానికి వర్మ, వరంగల్‌లోని LB కళాశాలలో సిబ్బంది మరియు అధ్యాపకులను కలిసి కొంతసేపు రహస్యంగా మాట్లాడాడు.

Love Story Review : ‘లవ్ స్టోరీ’ రివ్యూ..

వరంగల్‌లో కొండా సురేఖ – మురళి దంపతులకు రాజకీయంగా మంచి పేరు, పలుకుబడి ఉంది. వరంగల్ రాజకీయాల్లో వారు ఓ వెలుగు వెలిగారు. ఈ కాలేజీలో చదువుకునే సమయంలోనే సురేఖ – మురళీ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకథ నుంచి రాజకీయ ప్రస్థానం వరకు బయోపిక్‌గా తెరకెక్కించాలని భావిస్తున్నాడట వర్మ. ఆయన తీసిన బయోపిక్స్ అన్నీ క్రేజ్‌తో పాటు కలెక్షన్లూ రాబట్టాయి. మరి కొండా దంపతుల బయోపిక్‌తో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి..

Konda Surekha

 

విజయవాడలో చదువుకోవడం వల్ల అక్కడి రాజకీయాలు.. రామానాయుడు స్టూడియో దగ్గర జరిగిన బ్లాస్ట్ వల్ల రాయలసీమ ఫ్యాక్షనిస్టుల గురించి తెలిసింది కానీ తనకు తెలంగాణ సాయుధ పోరాటం గురించి మొన్నమొన్నటి వరకు ఏమీ తెలియదని.. కానీ ఈమధ్య అనుకోకుండా కలిసిన మాజీ నక్సలైట్ల నుంచి కొంతమంది అప్పటి పోలీసుల వరకు కొందరిని కలవగా కొన్ని సంచలన విషయాలు తెలిసాయని.. అందులో ఫస్ట్ టైం తనను బాగా ఆకర్షించింది.. ఎన్‌కౌంటర్‌లో చంపబడ్డ ఆర్‌కె అలియాస్ రామకృష్ణకు మురళీని ఉన్న మహా ప్రత్యేకమైన సంబంధం గురించి అని.. అప్పటి పరిస్థితులను సినిమాగా తీస్తానని, కోపరేట్ చెయ్యమని మురళీని అడిగానంటూ.. సినిమా సబ్జెక్ట్‌కి సంబంధించిన కీ పాయింట్స్‌ను చెబుతూ.. ఈ కొండా చిత్రం పూర్తిగా వరంగల్ మరియు పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో జరగబోతుందని వర్మ చెబుతున్న వాయిస్ రికార్డ్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది..