Vikram K Kumar : సూర్య ’24’ సినిమాకి సీక్వెల్ ఉంటుంది.. డైరెక్టర్ విక్రమ్ ప్రకటన..

థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ''నా తర్వాతి సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఉంది. థాంక్యూ రిలీజ్ అయ్యాక ఆ కథ మీద వర్క్ చేస్తాను. హిందీలో కూడా..........

Vikram K Kumar : సూర్య ’24’ సినిమాకి సీక్వెల్ ఉంటుంది.. డైరెక్టర్ విక్రమ్ ప్రకటన..

Suriya

Suriya :  ఇష్క్, మనం, 24, గ్యాంగ్ లీడర్.. లాంటి సినిమాలతో మెప్పించిన డైరెక్టర్ విక్రమ్ కే కుమార్. ఒకప్పుడు తమిళ్ లో సినిమాలు తీసిన విక్రమ్ ఆ తర్వాత తెలుగులో వరుస విజయాలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం నాగచైతన్యతో థాంక్యూ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా జులై 22న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో తాను తీసిన సినిమాల్లో ఒకటైన 24 సినిమాకి సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు. సూర్య హీరోగా మూడు విభిన్న పాత్రలలో కనిపిస్తూ టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన 24 సినిమా మంచి విజయం సాధించింది.

Regina Cassandra : స్వీట్ కోసం ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను

తాజాగా థాంక్యూ సినిమా ప్రమోషన్స్ లో విక్రమ్ కుమార్ మాట్లాడుతూ.. ”నా తర్వాతి సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థలో ఉంది. థాంక్యూ రిలీజ్ అయ్యాక ఆ కథ మీద వర్క్ చేస్తాను. హిందీలో కూడా ఓ యాక్షన్‌ సినిమా చేయబోతున్నాను. నేను ఇప్పటిదాకా చేయని కథ అది. ఇక నా ‘24’ సినిమాకి సీక్వెల్ గురించి అప్పుడప్పుడు కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. దానికి సీక్వెల్ కచ్చితంగా తీస్తాను. కానీ అది ఎప్పుడు కుదురుతుందో తెలీదు” అని తెలిపాడు. 24 సినిమాకి సీక్వెల్ ప్రకటించడంతో సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ త్వరగా తీయాలని కోరుతున్నారు.