Regina Cassandra : స్వీట్ కోసం ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను

రెజీనా మాట్లాడుతూ.. ''మిస్టీ దోయ్ అనే స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ సారి రాత్రి పూట ఆ స్వీట్ తిందామని బయట షాప్ దగ్గరకు వెళ్లాను. అప్పటికే లేట్ అయింది. మేము వెళ్లేసరికి...............

Regina Cassandra : స్వీట్ కోసం ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను

Regina

Regina Cassandra :  శివ మనసులో శృతి సినిమాతో టాలీవుడ్‌కు పరిచమైన రెజీనా కసాండ్రా ఆ తర్వాత రొటీన్‌ లవ్‌ స్టోరీ, కొత్త జంట, పిల్లా.. నువ్వు లేని జీవితం, పవర్‌, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌… లాంటి పలు హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు హిందీలో కూడా కనిపిస్తుంది. ఇక ఓటీటీలు వచ్చిన తర్వాతి నుంచి వెబ్ సిరీస్ లలో నటిస్తుంది రెజీనా. ఇటీవలే చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో ఐటెం సాంగ్ తో కూడా మెప్పించింది. తాజాగా అన్యాస్ ట్యుటోరియల్ అనే హారర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది రెజీనా. ఈ సిరీస్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది.

Vijayendra Prasad : అప్పుడు వర్మ గురించి తప్పుగా మాట్లాడాను.. కానీ.. వర్మపై పొగడ్తలు కురిపించిన రాజమౌళి తండ్రి..

తాజాగా అన్యాస్‌ ట్యుటోరియల్‌ ప్రమోషన్స్ లో భాగంగా అలీతో సరదాగా ప్రోగ్రాంకి వచ్చిన రెజీనా పలు ఆసక్తికర విషయాలని తెలియచేసింది. ఇందులో భాగంగానే ఓ స్వీట్ తినడం కోసం ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పానని చెప్పింది రెజినా. రెజీనా మాట్లాడుతూ.. ”మిస్టీ దోయ్ అనే స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. ఓ సారి రాత్రి పూట ఆ స్వీట్ తిందామని బయట షాప్ దగ్గరకు వెళ్లాను. అప్పటికే లేట్ అయింది. మేము వెళ్లేసరికి షాప్ క్లోజ్ చేస్తున్నారు. నేను ఆ స్వీట్ అకావాలని అడిగితే షాప్‌ క్లోజ్ చేశాం, ఇప్పుడు కుదరదు అని చెప్పాడు. దీంతో నేను ప్రగ్నెంట్‌, నాకు మిస్టీ దోయ్ స్వీట్ తినాలనిపిస్తుంది, తినాలి అది అని కొంచెం ఎమోషనల్ గా చెప్పాను. దీంతో అతను షాప్ తెరిచి ఆ స్వీట్ ఇచ్చాడు. ఇలా ఒక స్వీట్ కోసం ప్రగ్నెంట్ అని అబద్దం చెప్పాను” అని తెలిపింది. దీంతో రెజీనా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.