Vijayendra Prasad : అప్పుడు వర్మ గురించి తప్పుగా మాట్లాడాను.. కానీ.. వర్మపై పొగడ్తలు కురిపించిన రాజమౌళి తండ్రి..

విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ''శివ సినిమా నాటి దర్శకుడు మళ్లీ కనిపించాడు. పది నెలల క్రితం కనబడుట లేదు అనే సినిమా ఫంక్షన్‌కు నేను అతిధిగా వెళ్ళాను. అదే కార్యక్రమానికి వర్మ కూడా...............

Vijayendra Prasad : అప్పుడు వర్మ గురించి తప్పుగా మాట్లాడాను.. కానీ.. వర్మపై పొగడ్తలు కురిపించిన రాజమౌళి తండ్రి..

Rgv

RGV :  ఆర్జీవీ ఇటీవల మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంలో ‘లడిఖి’ అనే సినిమాని తెరకెక్కించాడు. దీన్ని తెలుగులో ‘అమ్మాయి’గా విడుదల చేస్తున్నారు. మార్షల్ ఆర్ట్స్ ఫేమ్ పూజా భలేకర్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషించగా ఈ సినిమా జూలై 15న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇండియాలోని పలు భాషలతో పాటు చైనాలో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా దాదాపు 40 వేల థియేటర్స్ లో విడుదలవనుంది. ఇటీవల నిర్వహించిన లడిఖి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌, సంగీత దర్శకులు ఎమ్‌ఎమ్‌ కీరవాణి అతిధులుగా హజరయ్యారు.

ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. ”శివ సినిమా నాటి దర్శకుడు మళ్లీ కనిపించాడు. పది నెలల క్రితం కనబడుట లేదు అనే సినిమా ఫంక్షన్‌కు నేను అతిధిగా వెళ్ళాను. అదే కార్యక్రమానికి వర్మ కూడా వచ్చాడు. అప్పుడు నేను దాదాపు 15 ఏళ్ల పాటు వర్మపై నాకున్న కోపం, చిరాకు, బాధ, అసహ్యం అన్ని కలిపి ఒక్కసారిగా బయటకు తీసి మాట్లాడాను. శివ సినిమా చూసి వందల మంది రచయితలు, డైరెక్టర్లు, టెక్నిషియన్లు వర్మ వల్ల ప్రేరణ పొంది ఇండస్ట్రీకి వచ్చారు. నేను కూడా ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొందాను. కానీ ఇప్పుడు అలాంటి వర్మ కనిపించడం లేదు. మీకు కనిపిస్తే చెప్పండి మళ్లీ శివ లాంటి సినిమా తీయమని ఆ రోజు అన్నాను.”

Nitu Chandra : భార్యగా ఉంటే నెలకి 25 లక్షలిస్తా అన్నారు.. ఎమోషనల్ అయిన గోదావరి హీరోయిన్..

”ఆ రోజు ఇలా అనొచ్చో లేదో తెలీదు కానీ వర్మని చూడగానే నాలోని ఆవేశం బయటకి వచ్చి అలా అనేలా చేసింది. కానీ ఇప్పుడు అమ్మాయి సినిమా చూస్తుంటే నాకు శివ నాటి వర్మ మళ్లీ కనిపించారు. ఇప్పుడు గర్వంగా చెప్తున్నా. వర్మ గారు మీలో ఆనాటి డైరెక్టర్‌ నాకు మళ్లీ కనిపించారు. శివ కంటే వంద రెట్లు ఎక్కువగా కనిపించారు. ఈ సినిమా 40వేల థియేటర్లో విడుదలవ్వడమంటే సాధారణ విషయం కాదు. ఈ ఘనత ఇప్పటి వరకూ ఎవరూ సాధించలేదు. మన తెలుగు వారందరికి ఇది గర్వకారణం” అంటూ వర్మపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆ తర్వాత వర్మని దగ్గరికి తీసుకొని అభినందించారు.

దీనికి వర్మ మాట్లాడుతూ.. మీరన్న మాటలు నాకు ఎప్పటికి గుర్తుంటాయి. ఇవి నాకు బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌ అని తెలిపాడు.