Earthquakes : పాక్,ఇండోనేషియా దేశాలను వణికించిన భూకంపం

పాకిస్థాన్, ఇండోనేషియా దేశాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. భూకంపాలకు నిలయంగా మారిన ఇండోనేషియా దేశంలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ వాతావరణ, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది....

Earthquakes : పాక్,ఇండోనేషియా దేశాలను వణికించిన భూకంపం

Earthquake Jolts Pakistan, Indonesia

Updated On : July 7, 2023 / 7:58 AM IST

Earthquakes : పాకిస్థాన్, ఇండోనేషియా దేశాల్లో శుక్రవారం భూకంపం సంభవించింది. భూకంపాలకు నిలయంగా మారిన ఇండోనేషియా దేశంలో శుక్రవారం రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ వాతావరణ, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. (Earthquake Jolts Pakistan, Indonesia) శుక్రవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం తనింబర్ దీవులకు వాయువ్యంగా 207 కిలోమీటర్ల దూరంలోని సముద్రగర్భంలో సంభవించింది.

Free Bus Seat : కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం కోసం ఓ వ్యక్తి ఏం చేశాడంటే…షాకింగ్

ఈ భూకంపం వల్ల సముద్రంలో భారీ అలలు రాలేదు. ఇండోనేషియా భూకంపం వల్ల ఎలాంటి సునామీ ముప్పులేదని శాస్త్రవేత్తలు చెప్పారు. పాకిస్థాన్ దేశంలో శుక్రవారం భూకంపం సంభవించింది. పాకిస్థాన్ దేశంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ భూకంపం లోతు 170 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఈ భూకంపం వల్ల ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.