Free Bus Seat : కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం కోసం ఓ వ్యక్తి ఏం చేశాడంటే…షాకింగ్

మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం కోసం ఓ హిందూ వ్యక్తి ఏకంగా బుర్ఖా వేసుకొని మహిళ అవతారం ఎత్తిన ఉదంతం కర్ణాటక రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. ఈ ఉచిత బస్సు పథకాన్ని పొందాలని ధార్వాడ్ జిల్లాకు చెందిన వీరభద్రయ్య అనే వ్యక్తి ఏకంగా బుర్ఖా వేసుకొని మహిళగా అవతారం ఎత్తాడు....

Free Bus Seat : కర్ణాటకలో ఉచిత బస్సు ప్రయాణం కోసం ఓ వ్యక్తి ఏం చేశాడంటే…షాకింగ్

ఉచిత బస్సు ప్రయాణం కోసం వేషం మార్చి...బుర్ఖా ధరించి...

Free Bus Seat : మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం కోసం ఓ హిందూ వ్యక్తి ఏకంగా బుర్ఖా వేసుకొని మహిళ అవతారం ఎత్తిన ఉదంతం కర్ణాటక రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. కర్ణాటక ప్రభుత్వం శక్తి యోజన పథకం కింద మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. అయితే ఈ ఉచిత బస్సు పథకాన్ని పొందాలని ధార్వాడ్ జిల్లాకు చెందిన వీరభద్రయ్య అనే వ్యక్తి ఏకంగా బుర్ఖా వేసుకొని మహిళగా అవతారం ఎత్తాడు. (Hindu man wears burqa)

Crocodile Enters House : కృష్ణా నదీ తీరంలోని ఇంట్లోకి వచ్చిన మొసలి…ఆపై ఏం జరిగిందంటే…

‘‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు’’ అన్నట్లు వీరభద్రయ్య సర్కారు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు టికెట్ పొందటానికి బుర్ఖా ధరించి, మహిళ పేరిట ఉన్న ఆధార్ కార్డు చేత్తో పట్టుకొని ధార్వాడ్ జిల్లా బస్ స్టాప్ లో ప్రయాణికులకు దర్శనమిచ్చారు. (to get Free Bus Seat in Karnataka)  వీరభద్రయ్య బుర్ఖా ధరించి మహిళా వేషంలో బస్ స్టాప్ లో ఒంటరిగా కూర్చొని ఉండగా గమనించిన చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి అతన్ని ప్రశ్నించారు.

Viral Video : ఆడపిల్లల బాత్రూమ్‌లో సీసీ కెమెరాలు..! స్కూల్ ప్రిన్సిపాల్‌‌ను పిచ్చకొట్టుడు కొట్టారు, వీడియో వైరల్

తాను భిక్షాటన చేసేందుకే తాను బురఖా ధరించి మహిళ వేషం వేశానని వీరభద్రయ్య సెలవీయడం కొసమెరుపు. అసలు విషయం ఆరా తీస్తే కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడం కోసమే బురఖా వేసుకొని ఆడ వేషం కట్టినట్లు వెల్లడైంది. ఉచిత బస్సు ప్రయాణం కోసం వీరభద్రయ్య వేషం మార్చి మహిళగా కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.