Summer Sapota Fruit : వేసవిలో ఈపండు తింటే శరీరం చల్లబడుతుంది!

మలబద్దక సమస్యను తొలగించడంతో పాటు ఈ పండులో కొన్ని రసాయనాలుపేగు చివరన ఉండే పలుచని శ్లేష్మపొర దెబ్బతినకుండా కాకుండా కాపాడతాయి.

Summer Sapota Fruit : వేసవిలో ఈపండు తింటే శరీరం చల్లబడుతుంది!

Sapota (1)

Summer Sapota Fruit : వేసవి కాలంలో దొరికే పండ్లలో సపోటా ఒకటి. ఎండలతో పాటు చల్లదనాన్ని తీసుకువచ్చే తియ్యటి పండు సపోటా. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ చెట్లు వేడి ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతాయి. పలుచని చర్మం కింద తేనె రంగులో ఉండే రుచులూరించే తియ్యటి గుజ్జుతో తినడానికి మధురంగా ఉంటుంది సపోటా. దీనిలో చాలా ఎక్కువ కేలరీలు ఉంటాయి. సపోటా తినడానికి చాలా రుచికరంగా ఉండటం వలన దీనిని ఐస్‌క్రీములు, మిల్క్ షేక్స్, ఫ్రూట్ సలాడ్స్ తయారుచేసేందుకు ఉపయోగిస్తుంటారు.

శరీరాన్ని చల్లబరిచే గుణం ఈ పండులో ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ పండ్లలో విటమిన్ ఏ, బి, సి పుష్కలంగా ఉంటాయి. సపోటాలో కాపర్, ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, నియాసిస్ వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. కంటి చూపును మెరుగుపరచడంలో, అలసటను తగ్గించడంలో, రక్తవృద్థిలో సహకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని క్యాల్షియం ఎముకల బలానికి తోడ్పడుతుంది.

రోజుకు కనీసం రెండు, మూడు సపోటా పండ్లు తింటే పిల్లలకు, పెద్దలకు ఎన్నో పోషకాలు అందుతాయంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళేవారిలోను, టెన్షన్ వర్క్స్ చేసేవారు సపోటాను తింటే అలసట వెంటనే తగ్గుతుంది. శరీరం బాగా నీరసించినపు , బాగా అలసిపోయినపుడు ఓ రెండు మూడు సపోటా పండ్లను తిన్నా, లేదంటే జ్యూస్ చేసుకుని తీసుకున్నా తక్షణే ఎనర్జీ అందుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరస్ గుణాలు కూడా వీటిలో ఎక్కువే. సపోటాలో విటమిన్-ఏ, విటమిన్-సి ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి యాంటీఆక్సీడెంట్లు లభిస్తాయి.

మలబద్దక సమస్యను తొలగించడంతో పాటు ఈ పండులో కొన్ని రసాయనాలుపేగు చివరన ఉండే పలుచని శ్లేష్మపొర దెబ్బతినకుండా కాకుండా కాపాడతాయి. పీచుపదార్థాలు ఉండడంవల్ల క్యాన్సర్ కారక వైరస్‌ను నాశనం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. గర్భం ధరించిన స్త్రీలు, బాలింతలు కూడా సపోటా పండ్లు తినవచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. శిరోజాలకు కూడా సపోటా తగిన పోషణను అందిస్తుంది. తరచుగా తింటే చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. సపోటాలో ఉండే కాపర్, ఫాస్ఫరస్ చర్మానికి రక్షణ కల్పిస్తుంది. సపోటా శరీరంలో ఉన్న హార్మోన్లను బ్యాలెన్స్ చేసి, అడ్రినల్ గ్రంధులు చురుగ్గా ఉండేలా చేస్తుంది.

వేసవిలో ఎండల్లో తాపాన్ని తగ్గించుకునేందుకు మూడు సపోటా పండ్లు తీసుకుని వాటిపై చర్మం తీసేసి మూడు గ్లాసుల పాలు, ఒక స్పూన్ మీగడ, ఒక స్పూన్ వెనీలా కలిపి తయారుచేసిన మిల్క్ షేక్ వేసవి కాలంలో తీసుకుంటే ఎంతో ఆరోగ్యనిస్తుందని నిపుణులు చెబుతున్నారు.