Punjab Elections Postponed  : పంజాబ్ ఎన్నికలు వాయిదా..ఫిబ్రవరి 20కు వాయిదా వేసిన ఈసీ

ఫిబ్రవరి 20కు పంజాబ్ ఎన్నికలను ఈసీ వాయిదా వేసింది. దీంతో ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి 20కు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది.

Punjab Elections Postponed  : పంజాబ్ ఎన్నికలు వాయిదా..ఫిబ్రవరి 20కు వాయిదా వేసిన ఈసీ

Punjab Elections Postponed

postponed punjab assembly elections : ఫిబ్రవరి 20కు పంజాబ్ ఎన్నికలు వాయిదా వేయాలని కోరటంపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఫిబ్ర‌వ‌రి 14వ తేదీన జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్ర‌వ‌రి 14న జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 20కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఫిబ్రవరి 16న గురు రవిదాస్‌ జయంతి వేడుకల జరుగనున్న క్రమంలో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్ కు పంజాబ్ సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ లేఖ రాశారు. అధికార పార్టీయే కాకుండా ఇతర పార్టీలు కూడా ఎన్నికలు వాయిదా వేయాలని కోరాయి. ఫిబ్రవరి 16న గురు రవిదాస్ జయంతి ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్రమంలో పంజాబ్‌లో ఎన్నిక‌లు వాయిదా వేయాల‌ని రాష్ట్రంలోని వివిధ రాజ‌కీయ పార్టీలు, నేత‌లు ఎన్నిక‌ల సంఘానికి విన‌తులు అందించారు.

Also Read : Punjab elections : పంజాబ్‌ ఎన్నికలు వాయిదా పడే అవకాశం..

కాగా..ఫిబ్రవరి 16న గురు రవిదాస్‌ జయంతి వేడుకలు జరుగనున్న క్రమంలో బెనారస్‌ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతు సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు తనను కోరానని లేఖలో పేర్కొన్నారు. పంజాబ్ లో దళిత వర్గానికి చెందినవారు దాదాపు 32శాతంగా ఉన్నారని వారి మనోభావాలను గుర్తించాల్సిన అవసరం ఉందని సీఎం లేఖలో ప్రస్తావించారు.

ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు ఉత్తరప్రదేశ్ లోని బెనారస్‌లో జరగనున్న గురు రవిదాస్‌ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు పంజాబ్ నుంచి 20లక్షల మంది బెనారస్ వెళ్లే అవకాశం ఉందని సీఎం తెలిపారు. ఈ క్రమంలో ప్రకటించిన షెడ్యూల్‌ ను మార్చాలని ఈసీని కోరారు. ఈసీ ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం..పంజాబ్ లో ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నిక అనుకున్న షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తే..లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోలేరని తెలిపారు.

Also read : Telangana Covid : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ లేనట్లే ?

కాబట్టి ప్రజల మనోభావాలను గౌరవిస్తు పోలింగ్‌ తేదీని పొడిగించినట్లయితే బెనారస్‌ వెళ్లి రావడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోగలుగతామని లేఖలో సీఎం వివరించారు. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకొనేలా కనీసం ఆరు రోజులైనా ఎన్నికలను వాయిదా వేయాలని చన్నీ సీఈసీని కోరారు. సీఎం సీఎం చరణ్ జిత్ చన్నీ రాసిన లేఖపై చర్చించిన ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 14న జరగాల్సిన ఎన్నికలను ఫిబ్రవరి 20కు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది.