Telangana Cabinet : తెలంగాణలో నైట్ కర్ఫ్యూ లేనట్లే ?
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంది ? తదితర పరిణామాలపై చర్చించేందుకు 2022, జనవరి 17వ తేదీ సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశమైంది...

Night Curfew
Telangana Covid : కరోనా విజృంభిస్తోంది. అనూహ్యంగా కేసుల సంఖ్య అధికమౌతున్నాయి. దీంతో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. కఠిన ఆంక్షలు, నిబంధనలు అమలు చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు విధిస్తున్నాయి. ఏపీ రాష్ట్రం మంగళవారం నుంచి నైట్ కర్ఫ్యూ ను అమలు చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిబంధన పెడుతుందా ? అనే ఉత్కంఠ నెలకొంది.
Read More : Nara Lokesh Corona : టీడీపీ నేత నారా లోకేష్ కు కరోనా పాజిటివ్
ఈ క్రమంలో..ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంది ? తదితర పరిణామాలపై చర్చించేందుకు 2022, జనవరి 17వ తేదీ సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో వైరస్ కట్టడిపై ప్రధానంగా చర్చిస్తున్నారు. కరోనా వైరస్..పాజిటివ్ కేసుల సంఖ్య నమోదు..ఇతరత్రా వివరాలను గణాంకాలతో సహా మంత్రి హరీష్ రావు వివరించారు. రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉందన్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్దంగా ఉందని తెలిపారు. దీంతో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం లేదని తెలుస్తోంది. భేటీ ముగిసిన అనంతరం పూర్తి వివరాలు తెలియనున్నాయి.