Nara Lokesh Corona : టీడీపీ నేత నారా లోకేష్ కు కరోనా పాజిటివ్

తనకు కరోనా వైరస్ సోకినట్లు ట్విట్టర్ ద్వారా లోకేష్ వెల్లడించారు. తగ్గే వరకు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు.

Nara Lokesh Corona : టీడీపీ నేత నారా లోకేష్ కు కరోనా పాజిటివ్

Lokesh

Updated On : January 17, 2022 / 2:48 PM IST

Corona positive for Nara Lokesh : టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ కరోనా బారిన పడ్డారు. కరోనా పరీక్షలు చేయించుకోగా ఆయనకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తనకు కరోనా వైరస్ సోకినట్లు ట్విట్టర్ ద్వారా లోకేష్ వెల్లడించారు. తగ్గే వరకు హోం ఐసోలేషన్ లో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఏపీలో మళ్లీ క‌రోనా కల్లోలం రేగింది. రాష్ట్రంలో భారీగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న రాష్ట్రంలో 30,022 కరోనా నిర్థార‌ణ పరీక్షలు నిర్వహించగా.. 4,570 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,06,280 కి పెరిగింది. వైరస్ వల్ల చిత్తూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 14,510 కి పెరిగింది.

Perfectly Healthy : పరిపూర్ణ ఆరోగ్యవంతులంటే ఎలా ఉండాలంటే?..

ఆదివారం 669 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 26వేల 770కి పెరిగిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,65,000 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.