Minister Gangula ED Raids: మంత్రి గంగుల ఇంట్లో ముగిసిన ఈడీ, ఐటీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం

మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు ముగిశాయి. దాదాపు 8 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు అధికారులు సీజ్ చేసినట్లుగా సమాచారం.

Minister Gangula ED Raids: మంత్రి గంగుల ఇంట్లో ముగిసిన ఈడీ, ఐటీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం

Minister Gangula ED Raids: మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు ముగిసినట్లుగా సమాచారం అందుతోంది. మంత్రి గంగుల ఇంట్లో ఇవాళ ఈడీ, ఐటీ సోదాలు జరిగాయి. దాదాపు 8 గంటల పాటు ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు అధికారులు సీజ్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.

సోదాలు జరిగే సమయంలో విదేశాల్లో ఉన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన హైదరాబాద్ కు పయనం అయ్యారు. హైదరాబాద్ కు చేరుకున్న వెంటనే నేరుగా కరీంనగర్ వెళ్లనున్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సోదాలకు సంబంధించి నోటీసలు ఇచ్చిన తర్వాతే అధికారులు అక్కడి నుంచి బయలుదేరే అవకాశం ఉంది. పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది.

గురువారం కూడా పలు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లల్లో, అలాగే ఆఫీసుల్లో సోదాలు కొనసాగు అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రి గంగుల గురువారం కరీంనగర్ కు చేరుకోబోతున్నట్లుగా సమాచారం. గంగుల బంధువులు, ఇళ్లు, ఆఫీసుల్లో ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు నిర్వహించారు. గంగుల కరీంనగర్ కు చేరుకున్న తర్వాత ఆయనకు నోటీసులిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

బుధవారం ఉదయం నుంచి కూడా అధికారులు దాదాపు ఎనిమిదిన్నర గంటలుగా అధికారులు సోదాలు జరిపారు. మంత్రి గంగుల బంధువులు, సన్నిహితుల ఇళ్లలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. రేపు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టికి అయితే సోదాలు ముగించారు అధికారులు.