MLC Kavitha ED Trial Postponed : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ఎమ్మెల్సీ కవితకు ఊరట

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఉపశమనం దక్కింది. మార్చి 9న విచారణను ఈడీ వాయిదా వేసింది. కవిత లేఖపై స్పందించిన ఈడీ.. విచారణను మార్చి11వ తేదీకి వాయిదా వేసింది.

MLC Kavitha ED Trial Postponed : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ఎమ్మెల్సీ కవితకు ఊరట

KAVITA

MLC Kavitha ED Trial Postponed : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఉపశమనం దక్కింది. మార్చి 9న విచారణను ఈడీ వాయిదా వేసింది. కవిత లేఖపై స్పందించిన ఈడీ.. విచారణను మార్చి11వ తేదీకి వాయిదా వేసింది. ఈడీ అనుమతితో రెండు రోజుల సస్పెన్స్ కు తెరపడింది. నిన్న బుధవారం(మార్చి8,2023)న ఈడీ ఇచ్చిన నోటీసుల ప్రకారం.. ఇవాళ (మార్చి9)న ఈడీ ఎదుట కవిత హాజరు కావాల్సివుంది. అయితే ముందస్తు కార్యక్రమాలున్నాయని, రెండు రోజులు గడువు కోరారు కవిత. మార్చి9న రాలేనని స్పష్ట చేస్తూ ఈడీకి కవిత లేఖ రాశారు.

తాను సామాజిక కార్యకర్తనని, తన కార్యక్రమాలు వారం ముందే ఖరారు అయ్యాయని ఈడీకి రాసిన లేఖలో కవిత తెలిపారు. మహిళా రిజర్వేషన్లపై ఆందోళనకు ఢిల్లీకి వెళ్లిన కవిత ఇవాళ మార్చి9న విచారణకు రాలేనని తేల్చి చెప్పారు. దీంతో కవిత విజ్ఞప్తిని ఈడీ అంగీకరించింది. కవిత లేఖ ప్రకారం విచారణ వాయిదా వేసేందుకు ఈడీ ఓకే చెప్పింది.  మార్చి9న విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపింది. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ కవిత ఒక లేఖ రాశారు.

MLC Kavitha Letter ED : ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. మార్చి11న విచారణకు హాజరవుతా

మార్చి 11న విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. మార్చి 9న ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేనని కవిత తెలిపింది. అయితే హడావిడి విచారణపై ఈడీని కవిత నిలదీసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడీ కార్యాలయానికి రమ్మనడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. దర్యాప్తు పేరుతో రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రస్తుత దర్యాప్తుతో తాను చేసేదేమీ లేదని చెప్పారు. రాజకీయ కక్షలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే అరెస్టైన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ విచారిస్తోంది. ఈ సందర్భంగా రామచంద్ర పిళ్లై కీలక విషయాలు వెల్లడించాడు. తాను ఎమ్మెల్సీ కవితకు బినామీ అని, ఆమె ఆదేశాల మేరకే తాను పని చేసినట్లు ఈడీకి చెప్పాడు. ఈ నేపథ్యంలో కవితను విచారించాలని ఈడీ నిర్ణయించింది. దీంతో నిన్న(బుధవారం) కవితకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను అధికారులు విచారించబోతున్నారు.

Delhi liquor scam : ఎమ్మెల్సీ కవితకు అరుణ్ రామచంద్ర పిళ్లై బినామీ .. ఈడీ విచారణలో స్టేట్‌మెంట్ ఇచ్చిన పిళ్లై

ఈ కేసులో గతంలోనే ఈడీ కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో విచారించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర, ముడుపుల అంశం వంటి అంశాలపై కవితను ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి గతంలో దాఖలు చేసిన చార్జిషీటులో రామచంద్ర పిళ్లై పాత్రను ఈడీ ప్రస్తావించింది. పిళ్లైపై అనేక అభియోగాలు నమోదు చేసింది. కవిత తరఫున అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకున్నారని చార్జిషీటులో ఈడీ పేర్కొంది. ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జిషీటులో కూడా ఈడీ కవిత పేరును ప్రస్తావించింది.