ENG vs AUS Ashes 2023 : యాషెస్ చరిత్రలో బెన్ స్టోక్స్ సరికొత్త రికార్డు .. ఆ విషయంలో రోహిత్‌దే అగ్ర‌స్థానం

రోహిత్ శర్మ తరువాత ఒకే టెస్టు సిరీస్ లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా షిమ్రాన్ హెట్మెయర్ నిలిచాడు. అతడు 15 సిక్సర్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.

ENG vs AUS Ashes 2023 : యాషెస్ చరిత్రలో బెన్ స్టోక్స్ సరికొత్త రికార్డు .. ఆ విషయంలో రోహిత్‌దే అగ్ర‌స్థానం

Ben Stokes

ENG vs AUS Test Match : ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య యాషెస్ -2023 టెస్ట్ సిరీస్ జరుగుతుంది. టెస్టు సిరీస్‌లో భాగంగా చివరి టెస్టు మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతుంది. ఇప్పటికే మూడు రోజుల ఆట ముగిసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి అతిథ్య ఇంగ్లండ్ జట్టు పట్టుబిగించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 389 పరుగులు చేసింది. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ 377 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ యాషెస్ సిరీస్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ టెస్టు సిరీస్ లో స్టోక్స్ 45 సగటుతో 405 పరుగులు చేశాడు.

Afghanistan Batsman: ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్.. వీడియో వైరల్

ఓవల్ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ 67 బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్ సాయంతో 42 పరుగులు చేశాడు. దీంతో ఒకే యాషెస్ టెస్టు సిరీస్‌లో అత్యధిక (15)  సిక్సులు కొట్టిన ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు. తద్వారా..  కెవిన్ పిటర్సన్ రికార్డును స్టోక్స్ బద్దలు కొట్టాడు. 2005 యాషెస్ సిరీస్ లో పీటర్సన్ మొత్తం 14 సిక్సులు కొట్టాడు. మరోవైపు టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక సిరీస్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ప్రస్తుతం భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. 2019-20 లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ లో రోహిత్ మొత్తం 19 సిక్సులు కొట్టాడు.

IND vs WI 2nd ODI: రెండో వన్డేలో టీమిండియా ఓటమి.. కుందేలు – తాబేలు కథ చెప్పిన హార్దిక్ పాండ్య

రోహిత్ శర్మ తరువాత ఒకే టెస్టు సిరీస్ లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా షిమ్రాన్ హెట్మెయర్ నిలిచాడు. అతడు 15 సిక్సర్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. తాజాగా బెన్ స్టోక్స్ ఒకే టెస్టు సిరీస్‌లో 15 సిక్సర్లతో ఈజాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.