England vs India: ఆదిలోనే ఇద్దరు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ డ‌కౌట్

ప్ర‌స్తుతం క్రీజులో జాస‌ర్ రాయ్‌(24 ప‌రుగులు)తో క‌లిసి బెన్‌ స్టోక్స్ (22 ప‌రుగులు) ఉన్నారు. ఇంగ్లండ్ జ‌ట్టు స్కోరు 7 ఓవ‌ర్ల‌కు 47/2 గా ఉంది.

England vs India: ఆదిలోనే ఇద్దరు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ డ‌కౌట్

Teamindia

England vs India: ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ వేదిక‌గా ఆతిథ్య జ‌ట్టుతో టీమిండియా మూడో వ‌న్డే మ్యాచు ఆడుతోంది. టాస్ గెలిచిన టీమిండియా మొద‌ట ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆదిలోనే ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెన‌ర్లుగా జాస‌న్ రాయ్, జానీ బెయిర్‌స్టో క్రీజులోకి వ‌చ్చారు. బెయిర్‌స్టో మూడు బంతులు ఆడి మొహ‌మ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో డ‌కౌట్ అయ్యాడు. ఆ కొద్దిసేప‌టికే జో రూట్ కూడా మొహ‌మ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లోనే డ‌కౌట్‌గా వెనుదిరిగాడు.

Sri Lanka Crisis: కేంద్రం కీలక నిర్ణయం.. శ్రీలంక సంక్షోభంపై అఖిలపక్ష భేటీకి పిలుపు

ప్ర‌స్తుతం క్రీజులో జాస‌ర్ రాయ్‌(24 ప‌రుగులు)తో క‌లిసి బెన్‌ స్టోక్స్ (22 ప‌రుగులు) ఉన్నాడు. ఇంగ్లండ్ జ‌ట్టు స్కోరు 7 ఓవ‌ర్ల‌కు 47/2 గా ఉంది. మూడు మ్యాచుల వ‌న్డే సిరీస్‌లో టీమిండియా ఓ మ్యాచ్‌లో విజ‌యం సాధించగా, ఇంగ్లండ్ కూడా ఓ మ్యాచ్‌లో గెలిచింది. నేటి మ్యాచులో గెలిచే జ‌ట్టును క‌ప్పు వ‌రిస్తుంది. మొదటి వన్డేలో ధాటిగా ఆడి గెలిచిన టీమిండియా.. రెండో వన్డేలో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.