EPFO New Guidelines : అధిక పింఛన్ పై ఈపీఎఫ్ వో కొత్త మార్గదర్శకాలు.. ఎవరు అర్హులు?
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ వో) అధిక పింఛన్ పై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన ఉద్యోగుల కోసం అధిక పింఛన్ పై ఈపీఎఫ్ వో సర్క్యులర్ విడుదల చేసింది.

EPF0
EPFO New Guidelines : ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ వో) అధిక పింఛన్ పై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన ఉద్యోగుల కోసం అధిక పింఛన్ పై ఈపీఎఫ్ వో సర్క్యులర్ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం ఉంటేనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. ఎంప్లాయిస్ పెన్షన్ (సవరణ) పథకం 2014ను గత నెల సుప్రీంకోర్టు సమర్థించిన సంగతి విధితమే.
ఈ నేపథ్యంలో ఎంప్లాయిస్ పెన్షన్ పథకం (ఈపీఎస్) పొందుతున్న ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్) సభ్యులకు రాబోయే నాలుగు నెలల్లో అధిక పింఛన్ ను ఎంచుకునేలా మరో అవకాశం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో 2014 సెప్టెంబర్ 1 నాటికి ఈపీఎస్ సభ్యులుగా ఉన్న ఉద్యోగులకు పెన్షన్ కోసం నెలకు రూ.15,000లకే పరిమితం చేసిన తమ పెన్షన్ జీతంలో 8.33 శాతానికి బదులుగా తమ అసలు జీతాల్లో 8.33 శాతం వరకు చెల్లించిన వారికి ఈ అవకాశం లభించింది.
Employees need know about EPF: ఈపీఎఫ్ గురించి ఉద్యోగులు తప్పక తెలుసుకోవాల్సిన 10 విషయాలు
అర్హులెవరు?
తప్పనిసరిగా అధిక వేతనాలపై ఈపీఎఫ్ చెల్లించి ఉండాలి. 2014 సెప్టెంబర్ 1వ తేదీకి ముందే పదవీ విరమణ చేసి ఉండాలి. రిటైర్ మెంట్ కు ముందే సదరు ఉద్యోగులు అధిక పింఛన్ కోసం ఆప్షన్ తీసుకుని ఉండాలి. దాన్ని ఈపీఎఫ్ వో పరిశీలించి, స్పష్టంగా తిరస్కరించి ఉండాలి. అప్పటి వేతన పరిమితి రూ.5000 లేదా రూ.6,500లకు మించి జీతాలు తీసుకుంటూ, వాటిపై ఈపీఎఫ్ ను చెల్లించి ఉండాలి. చట్ట సవరణకు ముందే ఈపీఎస్ కింద ఉద్యోగి, యజమాని అధిక పింఛన్ చెల్లింపుల కోసం జాయింట్ ఆప్షన్ తీసుకుని ఉండాలి.
దరఖాస్తు చేసుకునే విధానం..
అర్హులైన ఈపీఎస్ సభ్యులు మొదట వారికి సంబంధించిన ప్రాంతీయ ఈపీఎఫ్ వో కార్యాలయాలకు వెళ్లాలి. అవసరమైన దృవపత్రాలతో దరఖాస్తు సమర్పించాలి. కమిషనర్ సూచించిన పద్ధతిలో దరఖాస్తు ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రావిడెంట్ ఫండ్ నుంచి పెన్షన్ ఫండ్ కు సర్దుబాట్లు, ఫండ్ కు రీ-డిపాజిట్ అవసరమైతే అందుకోసం దరఖాస్తు ఫారమ్ లో పెన్షనర్ స్పష్టమైన అంగీకారాన్ని తెలపాలి.