UAN-Aadhar Link : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి.. లేదంటే డబ్బులు రావు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్‌కు ఆధార్ తో లింక్ చేయడం తప్పనిసరి అని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గడువు

UAN-Aadhar Link : పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఆ పని చేయండి.. లేదంటే డబ్బులు రావు

Uan Aadhar Linking

UAN-Aadhar Link : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్-EPF అకౌంట్‌కు ఆధార్ తో లింక్ చేయడం తప్పనిసరి అని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్-EPFO ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి గడువు పెంచుతూ వచ్చింది. ఇప్పుడు మరోసారి అలర్ట్ చేసింది. వెంటనే ఆ పని చేయాలని సూచించింది. లేదంటే పలు ప్రయోజనాలు కోల్పోతారని పీఎఫ్ ఖాతాదారులను ఈపీఎఫ్ఓ హెచ్చరించింది.

ఈ నెలాఖరు కల్లా(నవంబర్ 30, 2021) మీరు మీ ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ను(UAN) – ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుంది. లేదంటే.. ‘ఎల‌క్ట్రానిక్ చ‌లాన్ క‌మ్ రిట‌ర్న్ (ఈసీఆర్‌)’ భర్తీ కాదు. అంటే మీ పీఎఫ్ ఖాతాల్లో వచ్చే నెల నుంచి కంపెనీ వాటా జమ కాదు. వెంటనే ఉద్యోగుల యూఏఎన్‌ను ఆధార్‌తో అనుసంధానించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) యాజమాన్యాలకు సైతం తెలియజేసింది. ఇంత‌కు ముందు యూఏఎన్‌-ఆధార్ అనుసంధానానికి 31 ఆగస్టు 2021 తుది గడువుగా విధించారు. అనంతరం దాన్ని 2021 నవంబర్ 30 వ‌ర‌కు పొడిగించిన విషయం విదితమే.

Microsoft Free Trick : ఈ ట్రిక్‌తో MS Office సాఫ్ట్‌వేర్ ఉచితంగా యాక్సస్ చేసుకోవచ్చు.. ఇదిగో ప్రాసెస్..!

ఆధార్‌ అనుసంధానం జరగకపోతే.. పీఎఫ్‌ ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడంలోనూ ఇబ్బందులు పడాల్సిందే. అలాగే కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రభుత్వం అందించే ప్రయోజనాలకు కూడా దూరమవుతారని, బీమా ప్రయోజనాలు సైతం అందవని ఈపీఎఫ్ఓ హెచ్చరించింది.

ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ రూల్ పాటించాల్సిందే. తమ ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్ వెరిఫై చేయాల్సిన బాధ్యత యాజమాన్యానిదే. ఒకవేళ ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయనట్టైతే ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉంది. ఆధార్ లింక్ లేని పీఎఫ్ అకౌంట్‌లోకి యాజమాన్యం వాటా నిలిచిపోతుంది. సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 లోని సెక్షన్ 142 ప్రకారం ఈపీఎఫ్ఓ కొత్త నియమ నిబంధనలను అమలు చేయనుంది ఈపీఎఫ్ఓ.

New House : కొత్త ఇంట్లో పాలు పొంగించాలా…ఎందుకు

పీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయకపోయినా, యూఏఎన్ ఆధార్ వెరిఫికేషన్ పూర్తి కాకపోయినా ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ నిలిచిపోతుందని యాజమాన్యాలకు ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. అంటే ఉద్యోగులకు పీఎఫ్ అకౌంట్‌లో తమ వాటా మాత్రమే కనిపిస్తుంది. యజమాని షేర్ కనిపించదు. ఉద్యోగులు కూడా తమ ఆధార్ నెంబర్‌ను పీఎఫ్ అకౌంట్‌తో లింక్ చేయొచ్చు.

మరి యూఏన్ ను ఆధార్ తో లింక్ చేయడం ఎలా? ప్రాసెస్ ఏంటి? ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి? అనే సందేహాలు అనేకమందికి ఉన్నాయి. దీనికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఆన్ లైన్ లోనే లింకింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు.. అదెలాగంటే…

ఈపీఎఫ్ – ఆధార్ లింక్.. ఆన్‌లైన్‌లో ఇలా చేయండి..

* ఈపీఎఫ్ఓ పోర్టల్‌( https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/) ఓపెన్ చేయాలి.

* 12 అంకెల యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.

* ఆ తర్వాత Manage ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

* ఆ తర్వాత డ్రాప్‌డౌన్ మెనూలో KYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.

* కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Aadhaar సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్, పేరు ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే పేరు, నెంబర్ ఎంటర్ చేయాలి.

* ఆ తర్వాత వివరాలు ఓసారి సరి చూసుకోవాలి. మీ వివరాలు యూఐడీఏఐ డేటాతో క్రాస్ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత Verified అని కనిపిస్తుంది. ( కేవైసీలో మీరు ఇచ్చిన సమాచారం సరైందే అయితే మీ ఆధార్ నంబర్ ఆటోమేటిక్‌గా ఈపీఎఫ్ ఖాతాతో లింక్ అవుతుంది.)

* దీంతో ఈపీఎఫ్‌, యూఏఎన్ ఆధార్‌ లింకింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది.