New House : కొత్త ఇంట్లో పాలు పొంగించాలా…ఎందుకు?…

క్రొత్త ఇంటిలోకి ప్రవేశించడం అంటే క్రొత్త జీవితం యొక్క ప్రారంభం అన్నమాట. మనలో ప్రతి ఒక్కరూ అడ్డంకులు లేని సంతృప్తితో కూడిన జీవితాన్ని గడపాలని ఆశిస్తారు.

New House : కొత్త ఇంట్లో పాలు పొంగించాలా…ఎందుకు?…

Milk New House (1)

New House : భారతదేశంలో హిందువులు రకరకాల ఆచారాలు, సంప్రదాయాలను అనుసరిస్తారు.  వాటిలో ఒకటి కొత్త ఇంటిలోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించడం. ఈ ఆచారం అనాదిగా వస్తోంది. అలాగే ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి మారినప్పుడు కూడా పాలుపొంగిస్తారు. పాలు పొంగితే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కళకళలాడుతూ ఉంటుందని చెప్పుతారు.సకల సంపదలకు లక్ష్మి దేవి అధిపతి. లక్ష్మి దేవి సముద్ర గర్భం నుండి జన్మించింది.లక్ష్మి పతి శ్రీహరి పాల సముద్రంలో పవళిస్తారు.

పాలు పొంగి న ఇల్లు.. శ్రీలు పొంగిన ఇల్లు అవుతుందని మన వారి నమ్మకం. పాలు పొంగిన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ,భోగభాగ్యాలు విలసిల్లు తాయని విశ్వసిస్తారు. కొత్త ఇంటిలోకి ముందుగా గోవు ను ప్రవేశపెట్టి తర్వాత క యజమాని ప్రవేశిస్తాడు .గోవు మహాలక్ష్మి తిరిగిన ఇంటిలో దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇంటి ఆడపడుచు లను పిలిచి గృహప్రవేశ సమయంలో ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆ పాలతో పరమాన్నం వండి వాస్తు పురుషుని కి నైవేద్యం పెడతారు. దీనితో ఆ ఇంట్లో సుఖశాంతులకు సంపదలకు కొదవ ఉండదని నమ్ముతారు. అందుకే కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు.

క్రొత్త ఇంటికి వెళ్లడం, అద్దెకు వెళ్లడం లేదా సొంత ఇల్లు కానీ, కొన్ని ఆచారాలతో ముడిపడి ఉంటుంది. మనం క్రొత్త ఇల్లు కొన్నప్పుడు, సాధారణంగా దక్షిణ భారతదేశంలోని చాలా కుటుంబాలలో వాస్తు పూజ, వాస్తు హవన్ మరియు గణేష్ పూజలతో గృహ ప్రవేశం జరుగుతుంది. పాలను కాగబెట్టటం, పొంగించటం అనే సంప్రదాయం ఉంది. దేవునికి అర్పించిన తరువాత, మిగిలిన పాలను కుటుంబ సభ్యులు పంచుకుంటారు.

క్రొత్త ఇంటిలోకి ప్రవేశించడం అంటే క్రొత్త జీవితం యొక్క ప్రారంభం అన్నమాట. మనలో ప్రతి ఒక్కరూ అడ్డంకులు లేని సంతృప్తితో కూడిన జీవితాన్ని గడపాలని ఆశిస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం, పాలు పొంగించుట ద్వారా మన జీవితాలను సంపద, ఆరోగ్యం మరియు ఆనందంతో నిండేలా చేస్తుందని నమ్ముతుంటారు. పాలు తూర్పు దిశలో పడినప్పుడు ఇది “శ్రేయస్సుకు , కీర్తి ప్రతిష్టలకు సంకేతంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే భారతీయ వాస్తు ప్రకారం ” తూర్పు దిశ” చాలా పవిత్రమైన దిక్కు కాబట్టి ఆదిక్కుగా పాలు పొంగిపొర్లితే ఆ నివాసంలో ఉండబోయే వారికి అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతుంటారు. తూర్పు ఆగ్నేయంలో ప్రతి ఇంట వంటగది ఉంటుంది. ఆదిక్కులో పాలుపొంగించటం అంటే ఒక రకంగా చెప్పాలంటే పాలు పొంగించటం ద్వారా అగ్నిదేవుణ్ని ఆహ్వానిస్తున్నట్లే…