Evaru Meelo Koteeswarulu : ఆట నాది కోటి మీది.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో చూశారా..

120 దేశాల్లో కామన్ మేన్ లైఫ్‌ని అనూహ్యంగా మార్చి, ఇండియాలో 9 భాషల్లో ఆల్‌టైమ్ సక్సెస్‌ఫుల్ టెలివిజన్ షో గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాపులర్ షో ను సన్ నెట్‌వర్క్, జెమిని టీవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. విజ్ఞానం, వినోదంతో పాటు సామాన్యుడి కలలు నిజం చేసేందుకు ఈ షో త్వరలో జెమినిలో ప్రసారం కానుంది.

Evaru Meelo Koteeswarulu : ఆట నాది కోటి మీది.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోమో చూశారా..

Evaru Meelo Koteeswarulu Promo

Updated On : March 15, 2021 / 6:05 PM IST

Evaru Meelo Koteeswarulu: 120 దేశాల్లో కామన్ మేన్ లైఫ్‌ని అనూహ్యంగా మార్చి, ఇండియాలో 9 భాషల్లో ఆల్‌టైమ్ సక్సెస్‌ఫుల్ టెలివిజన్ షో గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ పాపులర్ షో ను సన్ నెట్‌వర్క్, జెమిని టీవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. విజ్ఞానం, వినోదంతో పాటు సామాన్యుడి కలలు నిజం చేసేందుకు ఈ షో త్వరలో జెమినిలో ప్రసారం కానుంది.

మరి ఈ సెన్సేషనల్ షో కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కొత్తగా చెప్పక్కర్లేదు.. వెండితెర అయినా బుల్లితెర అయినా తన స్టైల్ పర్ఫార్మెన్స్‌తో ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడం తారక్‌‌‌కి వెన్నతో పెట్టిన విద్య.. తెలుగులో సరికొత్తగా రూపొందిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ లాంచ్ ప్రెస్‌మీట్ శనివారం ఉదయం హైదరాబాద్‌లో జరిగింది.

ఈ సందర్భంగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ప్రోమో రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ ఎప్పటిలానే తన స్టైల్‌లో ఆకట్టుకున్నాడు. ‘‘ఇక్కడినుంచి ఎంత పట్టుకెళ్తారో నేను చెప్పలేను.. కానీ లైఫ్‌లో నేను గెలవగలను అనే కాన్ఫిడెన్స్ మాత్రం కచ్చితంగా పట్టుకెళ్తారు.. నాది గ్యారెంటీ.. ఇక్కడ కల మీది.. కథ మీది.. ఆట నాది.. కోటి మీది.. రండి గెలుద్దాం.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’’.. అంటూ ప్రోమోతో షో పై అంచనాలు పెంచేశాడు యంగ్ టైగర్..