Indigestion Problems : అజీర్ణ సమస్యలకు అద్భుతమైన చిట్కాలు

ఆహారం సరిగ్గా జీర్ణంకాక, వ్యర్ధ విష పదార్ధాలు పేరుకుని పోయే అవకాశం ఉంటుంది. గ్యాస్ కార‌ణంగా క‌డుపు ఉబ్బ‌రంగా అనిపించ‌డం..

Indigestion Problems : అజీర్ణ సమస్యలకు అద్భుతమైన చిట్కాలు

Indigestion

Indigestion Problems : అజీర్ణ సమస్య మన ఆహారపు అలవాట్ల కారణంగానే ఉత్పన్నమౌతుంది. ఒక్కోసారి ఇది దీర్ఘకాలిక సమస్యగా కూడా మారి తీవ్రమైన ఆరోగ్యపరమైన, మానసికమైన ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ అజీర్ణం కారణంగా కడుపులో నొప్పి, మంట, అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఆహారం సరిగ్గా జీర్ణంకాక, వ్యర్ధ విష పదార్ధాలు పేరుకుని పోయే అవకాశం ఉంటుంది. గ్యాస్ కార‌ణంగా క‌డుపు ఉబ్బ‌రంగా అనిపించ‌డం.. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాక‌పోవ‌డం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించటం ద్వారా ఈ సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు.

1. పుదీనా లేదా గ‌డ్డి చామంతి పువ్వుల‌తో త‌యారు చేసిన హెర్బ‌ల్ టీని రోజుకు రెండు సార్లు తాగుతుండాలి. దీని వ‌ల్ల గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య త‌గ్గుతుంది. తిన్న ఆహారం జీర్ణ‌మ‌వుతుంది.

2. ఇంగువ వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా ఇంగువ క‌లిపి తాగాలి. ఇలా రోజుకు 3 సార్లు చేయాలి. 2 రోజుల పాటు ఈ విధంగా చేస్తే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

3. అజీర్ణానికి గురైనప్పుడు చల్లని మజ్జిగ ఒక కప్పు త్రాగాలి. కడుపులో ఆమ్ల తటస్థీకరణకు సహాయపడే లాక్టిక్ ఆమ్లం మజ్జిగలో ఎక్కువగా ఉంటుంది, తద్వారా అజీర్ణం తగ్గుదలలో సహాయపడుతుంది.

4. చల్లని నీటికి బ‌దులుగా గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగుతుండాలి. దీంతో శ‌రీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. అలాగే జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

5. కొబ్బరినూనె కడుపుకు ఉపశమనం కలగజేస్తుంది. కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ మరియు కాప్రిక్ యాసిడ్ వంటి సంతృప్త కొవ్వులు కలిగి ఉంటుంది. ఆపానవాయువులకు, అజీర్ణ సంబంధిత సమస్యలకు తక్షణ ఉపశమనంగా ఉంటుంది.

6. ఒక గాజు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ 2 టీస్పూన్లు కలపాలి. దానికి కొoచెం తేనె జోడించి సేవించండి. అజీర్ణం నుండి ఉపశమనం పొందడానికి ఈ పానీయం చక్కటి పరిష్కారం.

7. భోజ‌నం చేసిన త‌రువాత గుప్పెడు సోంపు గింజ‌ల‌ను నోట్లో వేసుకుని బాగా న‌మిలి మింగాలి. దీని వ‌ల్ల ఎలాంటి గ్యాస్ స‌మ‌స్య అయినా స‌రే త‌గ్గిపోతుంది. క‌డుపు ఉబ్బ‌రం ఉండ‌దు. అజీర్ణం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

8. చల్లటి పాలు కడుపులోని ఆమ్లాలను తటస్థం చేయడానికి దోహదపడతాయి. అంతేకాకుండా అజీర్ణం చికిత్సకు కూడా సహాయపడుతుంది. వెన్నతీసిన పాలు ఒక కప్పు చొప్పున రోజులో రెండుసార్లు త్రాగాలి.

9. మంటను తగ్గించడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను తేనె కలిగి ఉంటుంది. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ తేనె ను వేసుకుని భోజనానికి గంట ముందు తాగాలి. నీటితో కలపకుండా నేరుగా కూడా తేనెను ఒక తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

10. ఒక కప్పు వేడి నీటిలో ఒక అంగుళం పొడవుకలిగిన దాల్చిన చెక్కను కానీ లేదా పొడిని కానీ వేసి 5 నుండి 10 నిముషాలు నానబెట్టాలి. ఆ తర్వాత, కొంచం తేనేని కలుపుకుని సేవించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కారం,మసాలాతో వండిన ఆహారాలు, డీప్ ఫ్రైడ్ పదార్ధాలు, తిన్న వెంటనే పడుకునే అలవాట్లు, ధూమపానం, మద్యపానం, మరియు ఆస్పిరిన్, వంటి మందులు, ఆసిడ్ రిఫ్లెక్స్ , జీర్ణాశయ కాన్సర్, అల్సర్ మరియు పెద్దపేగు సంబంధిత సమస్యల వంటి అనేక కారణాల మూలంగా అజీర్ణం సంభవిస్తుంది. వీటి విషయంలో జాగ్రత్తలు పాటించటం వల్ల కొంత మేర ఉపశమనం పొందవచ్చు.