Cotton Seeds : ఒకే రకం పత్తి విత్తనాల సాగుకు రైతుల మొగ్గు..

మహారాష్ట్ర రైతులు సైతం ఈ కంపెనీ విత్తనాల కోసం ఆదిలాబాద్ వైపు పరుగులు పెట్టడంతో మరింత షార్టేజ్ ఏర్పడింది. ఎప్పటిలాగే ఈసారి కూడా విత్తనాల కృత్రిమ కొరత చూపించే కుట్ర జరుగుతుందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి .

Cotton Seeds : ఒకే రకం పత్తి విత్తనాల సాగుకు రైతుల మొగ్గు..

Cotton Seeds

Cotton Seeds : ఆదిలబాద్ అన్నదాతలకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. ఇక్కడి నేల స్వభావానికి మంచి దిగుబడినిచ్చే రాశి పత్తి విత్తనాల కొరత తో రైతులు ఇబ్బంది పడుతున్నారు. డిమాండ్ ఉన్న సీడ్ బ్యాగ్ ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువకు విక్రయిస్తుండగా… వేరే కంపెనీకి చెందిన రెండు బ్యాగులు కొంటేనే రాశి విత్తనాలను అమ్ముతామని వ్యాపారలు మెలిక పెడుతున్నారు. దీంతో ఏంచేయాలో తోచక అయోమయ పరిస్థితిలో పడిపోయారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు.

READ ALSO : Vegetable Seeds Cultivation : రైతు స్థాయిలో కూరగాయల విత్తనోత్పత్తిలో మెళకువలు

ఉత్తర తెలంగాణలో పత్తి అధిక విస్తీర్ణంలో సాగయ్యేది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే. మృగశిర కార్తెతో విత్తనాలు విత్తుకునే పనిలో నిమగ్నమయ్యే రైతులు… ఇప్పటికే తమ భూములను సాగు కోసం సిద్దం చేసుకున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేస్తుండంతో మార్కెట్ లో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఖరీఫ్ లో ఉమ్మడి జిల్లాలో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే చాలా మంది రైతులు విత్తనాలు కొనుగోలు చేశారు. గత ఏడాదిలాగే ఈ సారి కూడా రాశి కంపెనీలోని పలు వేరైటీలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో  ఆ రకం విత్తనాల కొరత ఏర్పడింది. రెట్టింపు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు అన్నదాతలు సిద్దమయ్యారు. అయినా కూడా రాశి రకం విత్తనాలు దొరకకపోవడం లేదు.

READ ALSO : Green Gram Cultivation : వేసవి పెసర సాగులో మేలైన యాజమాన్యం…అందుబాటులో అధిక దిగుబడినిచ్చే రకాలు

స్టాక్ ఉన్న వ్యాపారులు మాత్రం ఇతర కంపెనీల బ్యాగులు కొనుగోలు చేస్తే ఇక రాశీ విత్తనాలను ఇస్తామంటూ మెళక పెడుతున్నారు. దీంతో ఏంచేయాలో తోచక సీడ్స్  దుకాణాల చూట్టూ చక్కర్లు కొడుతున్నారు పత్తి రైతులు.

ప్రతి సంవత్సరం మిరుగుగా పిలుచుకునే మృగశిర కార్తే రోజు విత్తనాలు వేసుకునే ఆనవాయితీని నమ్ముకున్న జిల్లా రైతాంగం… దానికి అనుగుణంగా మే చివర, జూన్ మొదటి వారం లోపే కొంతమంది విత్తనాల కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తారు. రాశీ రకాలు అధిక దిగుబడి వస్తుండటంతో ఈసారి కూడా అదేరకం సీడ్ కోసం తహతహలాడుతున్నారు .

READ ALSO : Lady Finger Cultivation : 2 ఎకరాల్లో బెండసాగు.. 3 నెలల్లో రూ. 2 లక్షల ఆదాయం

మరోవైపు పక్కనే ఉన్న మహారాష్ట్ర రైతులు సైతం ఈ కంపెనీ విత్తనాల కోసం ఆదిలాబాద్ వైపు పరుగులు పెట్టడంతో మరింత షార్టేజ్ ఏర్పడింది. ఎప్పటిలాగే ఈసారి కూడా విత్తనాల కృత్రిమ కొరత చూపించే కుట్ర జరుగుతుందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి . ఖరీఫ్ మొత్తంలో విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

అదే సమయంలో విత్తనాల కొరత చూపించి అధిక ధరలకు విక్రయించినట్లైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. రైతులు కూడా ఒకేరకం విత్తనాల సాగుకు మొగ్గుచూపుతున్నారని, ఇప్పటికే ఆయా కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి విత్తనాన్ని అందుబాటులో ఉంచే విధంగా చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు.