Fenugreek Seeds : పొట్ట తగ్గించి, మధుమేహాన్ని అదుపులో ఉంచే మెంతులు

మెంతులు, తేనె, నిమ్మరసం కలిపి కషాయంలా తాగితే జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు సంబంధిత సమస్యలను నివారిస్తుంది.

Fenugreek Seeds : పొట్ట తగ్గించి, మధుమేహాన్ని అదుపులో ఉంచే మెంతులు

Fenugreek Seeds

Updated On : June 13, 2022 / 2:49 PM IST

Fenugreek Seeds : ప్రతి ఇంటి వంటగదిలో ఉండే మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. తినటానికి రుచికరంగా లేకపోయినా ఆరోగ్యానికి మాత్రం ఉపయోగకరంగా ఉంటాయి. మెంతుల్లో ప్రొటీన్ల శాతం అధికంగా ఉంటుంది. మెంతులలో ఔషధగుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది. గింజల్లోని జిగురు, చెడు రుచి జీర్ణాశయం సంబంధ సమస్యలకు ఉపకరిస్తాయి. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.

టైప్ 2 డయాబెటిస్ ను తగ్గించే గుణం మెంతులకు ఉందని అధ్యయనాల్లో తేలింది. మెంతులు గుండెలోని రక్తనాళాల పనితీరును మెరుగు పరుస్తుంది. గుండెపోటు రావడానికి కారణం గుండె కవాటాలు మూసుకుపోవడం. మెంతుల వల్ల గుండెకు హాని జరగకుండా కాపాడుతుంది. మెంతులు ఆరోగ్యానికి చాలా మేలు కలిగిస్తాయి. మహిళలకు మరీ మంచిది. రోజూ తీసుకుంటే మేలంటున్నారు నిపుణులు.

మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయి. బాలింతలకు మెంతికూర పప్పు, మెంతులు ఎక్కువగా తినిపిస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది. గర్భిణులకు ప్రసవాన్ని సులభతరం చేస్తుంది. మెంతులతో గర్భాశయ వ్యాధులు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రసవం తర్వాత మెంతులను వాడితే పేగుల కదలిక మెరుగవుతుంది.

మెంతులు, తేనె, నిమ్మరసం కలిపి కషాయంలా తాగితే జ్వరం నుంచి ఉపశమనం కలుగుతుంది. గొంతు సంబంధిత సమస్యలను నివారిస్తుంది. కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు రోజుకి 10 నుంచి 20 గ్రాముల మెంతులను నీళ్లలో లేదా మజ్జిగలో కలిపి తీసుకుంటే కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. పొట్ట ఉబ్బరంగా, జీర్ణక్రియ సరిగా లేకపోతే అరస్పూను మెంతుల్ని నానబెట్టి తినటం లేదంటే అన్నంలో కలిపి తీసుకోవటం వంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పేగుల లోపల వాపు తగ్గించే గుణం మెంతులకు ఉంది.

కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు మెంతులను కూరల్లో వేసుకుని తింటే మంచిది. మధుమేహులు మెంతుల్ని రోజుకి 3 సార్లు తీసుకుంటే డయాబెటిస్‌ అదుపులోకి వస్తుంది. మలబద్ధకం ఉన్నప్పుడు 2-3 చెంచాల గింజలు నానబెట్టి తింటే విరేచనం సాఫీగా అవుతుంది. స్కిన్ బర్న్, బొబ్బలు, తామర వంటి వాటి నుండి చర్మానికి ఉపశమనం కలిస్తాయి. మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.  కాలేయాన్ని శక్తివంతం చేస్తాయి.