Living Together : ప్రేమ జంటకు రూ.25వేలు ఫైన్..కొద్ది రోజులు కలిసుంటే సహజీవనం అయిపోదన్న హైకోర్టు

సహజీవనంపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అమ్మాయి, అబ్బాయి కొద్ది రోజులు కలిసున్నంత మాత్రాన సహజీవనంగా భావించలేమని చెప్పింది.

Living Together : ప్రేమ జంటకు రూ.25వేలు ఫైన్..కొద్ది రోజులు కలిసుంటే సహజీవనం అయిపోదన్న హైకోర్టు

Living

Living Together : సహజీవనంపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అమ్మాయి, అబ్బాయి కొద్ది రోజులు కలిసున్నంత మాత్రాన సహజీవనంగా భావించలేమని చెప్పింది. ఇంట్లో నుంచి పారిపోయిన ఓ యువ జంట తమ పెద్దల నుంచి రక్షణ కల్పించాలి పిటిషన్ దాఖలు చేయగా..వీరి వాదనలు విన్న అనంతరం జస్టిస్ మనోజ్ నేతృత్వంలోని ధర్మాసనం సదరు ప్రేమజంటకే రూ.25వేల జరిమానా విధించింది.

హర్యానాలోని యమునానగర్‌కు చెందిన 18 ఏళ్ల యువతి, 20 ఏళ్ల యువకుడు పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోలేదని ఇంట్లో నుంచి పారిపోయారు. కొద్ది రోజుల బయట నివసించి ఇంకాస్త వయసు రాగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే వారికి అమ్మాయి కుటుంబం నుంచి బెదిరింపులు వస్తుండడంతో హైకోర్టును ఆశ్రయించారు. వీరి తరపున ఓ న్యాయవాది పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరూ కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నారని, కానీ అమ్మాయి తల్లిదండ్రులు వీరి ప్రేమను ఒప్పుకోవడం లేదని, అబ్బాయికి పెళ్లి ఈడు వచ్చే వరకు పెద్దల నుంచి రక్షణ కల్పించాలని ఆ పిటిషన్ లో కోరారు. నవంబర్​ 24నుంచి ఇద్దరూ ఓ హోటల్ గదిలో ఉంటున్నట్లు కోర్టుకు చెప్పారు.

అమ్మాయి తల్లిదండ్రుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, ఆమెపై తప్పుడు కేసులు పెట్టాలని వారు చూస్తున్నారని పిటిషన్​లో అబ్బాయి ఆరోపించాడు. అయితే ఈ పిటిషన్​ను పరిశీలించిన న్యాయస్థానం.. ఈ ఆరోపణలు నమ్మశక్యంగా లేవని చెప్పింది. అమ్మాయి తల్లిదండ్రులపై పోలీస్​ స్టేషన్​లో కూడా కేసు నమోదు చేయలేదని గుర్తు చేసింది. యువ జంట వాదనను తోసిపుచ్చిన హైకోర్టు..వారికి 25,000 రూపాయల జరిమానా కూడా విధించింది.

సమాజం, సామాజిక విలువల్లో కొద్ది సంవత్సరాలుగా తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యేకించి అత్యుత్సాహమైన యువత వల్ల అనేక మార్పులు వస్తున్నాయి. వాళ్లు స్వేచ్ఛ పేరుతో తల్లిదండ్రుల సాంగత్యాన్ని విడిచిపెట్టి నచ్చిన వ్యక్తితో జీవించడానికి బయల్దేరుతున్నారు. మళ్లీ వారి జీవితానికి కుటుంబాల నుంచి ముప్పు వస్తుందని రక్షణ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. సహాజీవనం భారత్​లో కూడా బాగానే గుర్తింపు పొందింది అనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటివి తప్పేం కాదని చట్టాలు కూడా చెబుతున్నాయి. అయితే సమాజంలోని కొన్ని వర్గాలు ఇలాంటి సంబంధాలను అంగీకరించడానికి ఇష్టపడట్లేదు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ తమ విధులు, బాధ్యతలను నిర్వర్తించడంతో పాటు అనుబంధాన్ని స్థిరంగా కొనసాగిస్తేనే అది వైవాహిక సంబంధానికి దారితీస్తుందని నిరంతరం గుర్తుంచుకోవాలి అని కోర్టు పేర్కొంది.

ALSO READ Shooter Konica Layak : సోనూసూద్ నుంచి రైఫిల్ అందుకున్న నేషనల్ షూటర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్..!