Tollywood : ఇండస్ట్రీలో అన్ని ఫేక్ కలెక్షన్లే.. ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్నారు..

తాజాగా జరిగిన ఫిలిం ఛాంబర్ సమావేశం తర్వాత తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ముత్యాల రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో చెప్పేవన్నీ ఫేక్ కలెక్షన్లే. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఫేక్ కలెక్షన్లు.........

Tollywood : ఇండస్ట్రీలో అన్ని ఫేక్ కలెక్షన్లే.. ఇండస్ట్రీని సర్వనాశనం చేస్తున్నారు..

Tollywood

Tollywood:  గత కొన్ని రోజులుగా టాలీవుడ్ సమస్యల వలయంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమా టికెట్ ధరలు, థియేటర్లకు జనాలు రాకపోవడం, ఓటీటీ రిలీజ్ లు, పరిశ్రమలోని అంతర్గత ఇబ్బందులు, హీరోల రెమ్యునరేషన్స్.. ఇలా చాలా సమస్యలతో టాలీవుడ్ సతమతమవుతోంది. దీనిపై నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సమస్యలకి పరిష్కారం దొరికేవరకు కొన్ని రోజులు షూటింగ్స్ ఆపాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై టాలీవుడ్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరుసగా టాలీవుడ్ లో సమావేశాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఫిలిం ఛాంబర్ సమావేశం తర్వాత తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ముత్యాల రమేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ”ఇండస్ట్రీలో చెప్పేవన్నీ ఫేక్ కలెక్షన్లే. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఫేక్ కలెక్షన్లు, తప్పుడు కలెక్షన్లు ఇస్తున్నారు. అలాగే ఇష్టమొచ్చినట్టు టికెట్ రేట్లు పెంచుతున్నారు. కోటి రూపాయల కలెక్షన్లు వస్తే కోటిన్నర వచ్చిందని చెబుతున్నారు. దీంతో హీరోలు సినిమా, సినిమాకి రెమ్యూనరేషన్ పెంచేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు సర్వనాశనం అయ్యారు. ఇకనైనా డిస్ట్రిబ్యూటర్లు కళ్లు తెరవండి. ఫేక్ కలెక్షన్లు చెప్పి హీరోలు రెమ్యూనరేషన్స్ పెంచేలా చేయకండి. దీని వల్ల మీరు,మేము, అందరం నష్టపోతున్నాం” అని అన్నారు.

Ram Charan : టాలీవుడ్ సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి దిగిన రామ్ చరణ్

ఇండస్ట్రీలో ఫేక్ కలెక్షన్ల గురించి ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. తాజాగా ముత్యాల రమేశ్ వాటి గురించి మాట్లాడటంతో మరోసారి ఈ వ్యాఖ్యలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే ఉన్న సమస్యలతో టాలీవుడ్ సతమతమవుతుంటే ఇప్పుడు మరో సమస్య అని తలపట్టుకుంటున్నారు.