Fire accident in Hyderabad: హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం.. నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి వీఎస్టీ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గోదాములో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అందులో, వేడుకలను వాడే అలంకార సామగ్రిని ఉంచుతారు. అగ్ని ప్రమాదంలో వాటికి మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ కూడా అలుముకుంది.

Fire accident in Hyderabad: హైదరాబాద్ లోని బాగ్ లింగంపల్లి వీఎస్టీ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ గోదాములో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అందులో, వేడుకలను వాడే అలంకార సామగ్రిని ఉంచుతారు. అగ్ని ప్రమాదంలో వాటికి మంటలు అంటుకున్నాయి. దట్టమైన పొగ కూడా అలుముకుంది.
ఈ ప్రమాదంపై స్థానికులు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉన్న బస్తీ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు. నాలుగు ఫైరింజన్లతో అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇటీవల సికింద్రాబాద్ లోని డక్కన్ మాల్ లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనను మరవకముందే మళ్ళీ అటువంటి ఘటనలు చోటుచేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తోంది. సికింద్రాబాద్ లో జరిగిన ప్రమాదం అనంతరం కూడా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. భవనాల యజమానులు సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం ఇందుకు కారణాలుగా తెలుస్తోంది.