Dowry: కావలసినంత కట్నం తేలేదని ఏం చేశాడంటే..!

వరకట్నం అనేది సామాజిక దురాచారం.. అయినా దీనికి అడ్డుకట్ట పడటం లేదు. నానాటికి వరకట్నాలు పెరిగిపోతున్నాయి. ఇక వరకట్న వేధింపుల సంగతి చెప్పనవసరం లేదు. నిత్యం ఎదో ఓ చోట వరకట్న వేధింపులతో మహిళలు బలవుతూనే ఉన్నారు.

Dowry: కావలసినంత కట్నం తేలేదని ఏం చేశాడంటే..!

Dowry

Updated On : June 2, 2021 / 1:37 PM IST

Dowry: వరకట్నం అనేది సామాజిక దురాచారం.. అయినా దీనికి అడ్డుకట్ట పడటం లేదు. నానాటికి వరకట్నాలు పెరిగిపోతున్నాయి. ఇక వరకట్న వేధింపుల సంగతి చెప్పనవసరం లేదు. నిత్యం ఎదో ఓ చోట వరకట్న వేధింపులతో మహిళలు బలవుతూనే ఉన్నారు. మరికొందరు చిత్రహింసలకు గురవుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో కావాల్సినంత కట్నం తీసుకురాలేదని భార్యను కాల్చి చంపాడు భర్త.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్ నగర్ జిల్లాలోని బుధానా తహసీల్‌ ఉపవాలి గ్రామానికి చెందిన సారికా (24)కు కుల్దీప్ తో గతేడాది ఫిబ్రవరిలో వివాహం జరిగింది.

వివాహం జరిగిన తర్వాత మూడు నెలల వరకు భార్యతో సక్యతగానే ఉన్న కుల్దీప్ ఆ తర్వాత వరకట్నం కోసం వేధించడం మొదలు పెట్టాడు. అనేక సార్లు ఆమెపై దాడి చేశాడు. ఇక మంగళవారం రూ.50 లక్షలు కట్నం తీసుకురావాలని భార్య సారికతో గొడవపడ్డాడు. ఈ సమయంలోనే తన వద్ద ఉన్న తుపాకీతో భార్యపై మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. భార్యపై కాల్పులు జరిపిన అనంతరం కుల్దీప్, అతడి తండ్రి ఇంటినుంచి పారిపోయారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా ఓ వ్యాపారి హత్యకేసులో కుల్దీప్ గతంలో జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు.