Pushpa : అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్..!

టాలీవుడ్ హిస్టరీలో, యూట్యూబ్‌‌లో ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్  70+ మిలియన్ల వ్యూస్ రాబట్టిన మూవీగా ‘పుష్ప’ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది..

Pushpa : అల్లు అర్జున్ ఆల్ టైమ్ రికార్డ్..!

Pushpa

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’.. మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయిక.. పాపులర్ మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు..

బన్నీ బర్త్‌డేకి రిలీజ్ చేసిన ‘పుష్ప’ రాజ్ ఇంట్రడక్షన్ టీజర్ అదిరిపోయిందంటూ సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.. ఇప్పుడు ‘పుష్ప’ రాజ్ ఇంట్రో వీడియో 70 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది.. టాలీవుడ్ హిస్టరీలో, యూట్యూబ్‌‌లో ఫస్ట్ అండ్ ఫాస్టెస్ట్  70+ మిలియన్ల వ్యూస్ రాబట్టిన మూవీగా ‘పుష్ప’ ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది.. అలాగే ఈ వీడియోకు 1.6+ మిలియన్లకు పైగా లైక్స్ కూడా వచ్చాయి..

‘పుష్ప’ మూవీలో ఐకాన్ స్టార్ ఊరమాస్ గెటప్‌లో సరికొత్తగా కనిపించనున్నాడు.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చెయ్యనున్నారు.. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత బన్నీ – సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ‘పుష్ప’ మీద భారీ అంచనాలున్నాయి..