Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఎప్పటినుంచి ఎప్పటివరకంటే? డోంట్ మిస్..!

Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో కొత్త బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) ఈవెంట్‌ను ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది.

Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఎప్పటినుంచి ఎప్పటివరకంటే? డోంట్ మిస్..!

Flipkart Big Saving Days Sale Date Revealed, begins on December 16 with big discounts on Smartphones

Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ప్లాట్‌ఫారమ్‌లో కొత్త బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) ఈవెంట్‌ను ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. మొత్తం ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ సేల్ డిసెంబర్ 21 వరకు కొనసాగుతుంది.

ఈ సందర్భంగా ప్లాట్‌ఫారమ్ అనేక స్మార్ట్‌ఫోన్‌లపై అతిపెద్ద డీల్‌లను ఆఫర్ చేస్తుందని సేల్స్ పేజీలో పేర్కొంది. పలు ఎలక్ట్రానిక్స్‌పై డీల్స్, ఆఫర్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. కొనుగోలుదారులకు ఇదే సరైన సమయం.. ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్ (Flipkart Plus) మెంబర్‌షిప్ ఉన్నవారికి ఒక రోజు ముందుగానే సేల్ లైవ్ (Sale Live) అవుతుంది.

అర్హత ఉన్న కస్టమర్‌లు డిసెంబర్ 15న సేల్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ చాలా తక్కువ ధరకే పొందవచ్చు. గత అమ్మకాలతో పోలిస్తే.. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై ఆఫర్‌లు ఉంటాయో లేదో ప్రత్యేకంగా వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్ ప్రతి సేల్ ఈవెంట్‌లో ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందించదు. కంపెనీ ఇటీవలే బ్లాక్ ఫ్రైడే సేల్‌ (Black Friday Sale)ను నిర్వహించింది. ఆపిల్ iPhone 13పై రూ. 4వేల వరకు డిస్కౌంట్ అందించింది.

Flipkart Big Saving Days Sale Date Revealed, begins on December 16 with big discounts on Smartphones

Flipkart Big Saving Days Sale Date Revealed, begins on December 16 with big discounts on Smartphones

Read Also : iPhone 13 Sale on Flipkart : ఆపిల్ ఐఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13పై అదిరే డీల్.. తక్కువ ధరకే పొందాలంటే ఇలా చేయండి..!

మునుపటి అన్ని ఫెస్టివల్ సేల్ ఈవెంట్‌లను కోల్పోయిన వారు లేటెస్టుగా సేల్ ద్వారా డివైజ్ కొనుగోలు చేసుకోవచ్చు. అయినప్పటికీ, గత ఏడాదిలో ఐఫోన్‌పై తగినంత బెస్ట్ ఆఫర్ ఉంటుందని వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్ (Flipkart Diwali Sale) ఈవెంట్‌లో ఐఫోన్ 13ను రూ. 49,999 కన్నా తక్కువ ధరకు అందించిన అత్యుత్తమ ఆఫర్ ఇప్పటివరకు అందుబాటులోనే ఉంది.

ఇతర స్మార్ట్‌ఫోన్లలో Realme, Apple, Vivo, Poco వంటి స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల నుంచి అనేక ఫోన్‌లపై డీల్స్ ఉంటాయని చెప్పవచ్చు. ఫ్లిప్‌కార్ట్ టాబ్లెట్‌లు, మానిటర్లు, ప్రింటర్లు, మరిన్నింటితో సహా ఎలక్ట్రానిక్స్‌పై 80 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.టెలివిజన్‌లు, అప్లియన్స్‌పై కూడా 75 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు. వివిధ ప్రొడక్టులపై మరెన్నో డీల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 15న డీల్స్, ఆఫర్ల గురించి మరిన్ని వివరాలను పొందవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్.. పోకో స్మార్ట్‌ఫోన్లపై బెస్ట్ డీల్స్ ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి..!