Flop Movies : ఆఫ్టర్ కరోనా.. అటు హిట్ సినిమాలే కాదు.. ఫ్లాప్స్ కూడా ఎక్కువే ఉన్నాయి..

ఏ స్టార్ అయినా సినిమా బాగున్నంత వరకే. సినిమాలో అసలు పస లేకపోతే ఏ హీరోని అయినా పక్కన పెట్టేస్తున్నారు జనాలు. స్టార్ హీరోలు కదా ఏం తీసినా................

Flop Movies : ఆఫ్టర్ కరోనా.. అటు హిట్ సినిమాలే కాదు.. ఫ్లాప్స్ కూడా ఎక్కువే ఉన్నాయి..

Flop Movies List

Flop Movies :  కరోనా తర్వాత రిలీజైన సినిమాలు పుష్ప, శ్యామ్ సింగరాయ్, అఖండ, బంగార్రాజు, KGF2, RRR, సర్కారు వారి పాట.. ఇలా చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. మన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి అని ఆనందిస్తున్నాము. సౌత్ సినిమాలు బాలీవుడ్ లో భారీ విజయం సాధిస్తున్నాయి అని సంబర పడుతున్నాయి. కానీ ఒక వైపు హిట్ సినిమాలు ఎన్ని ఉన్నాయో బాలీవుడ్, సౌత్ లో ఫ్లాప్స్ కూడా ఎక్కువే ఉన్నాయి కరోనా తర్వాత. బాలీవుడ్ లో ఎక్కువ ఫ్లాప్స్ ఉన్నా సౌత్ లో కూడా కొన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయి.

ఏ స్టార్ అయినా సినిమా బాగున్నంత వరకే. సినిమాలో అసలు పస లేకపోతే ఏ హీరోని అయినా పక్కన పెట్టేస్తున్నారు జనాలు. స్టార్ హీరోలు కదా ఏం తీసినా చూసేస్తారు అనే రోజులు పోయాయి. ఎంత పెద్ద పాన్ ఇండియా హీరో అయినా, ఎంత టాప్ డైరెక్టర్ అయినా, ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అయినా, ఏ రేంజ్ లో సినిమా తీసినా, హిట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. సినిమాలో కంటెంట్ లేకపోతే స్టార్ హీరోలని కూడా చూడకుండా లైట్ తీసుకుంటున్నారు ఆడియన్స్. ఇలా ఎన్నో ఆశలతో ఆడియన్స్ ముందుకొచ్చినా, కంటెంట్ లేకపోతే కటౌట్ కి వాల్యూ లేదంటూ జనాన్ని ఆకట్టుకోలేక ఇటీవల ఫ్లాప్స్ కూడా తెచ్చుకున్నారు. అలా ఫ్లాప్స్ తెచ్చుకున్న ముఖ్యమైన సినిమాలు చాలానే ఉన్నాయి అన్ని సినీ పరిశ్రమలలో.

 

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించిన సినిమా జయేష్ భాయ్ జోర్దార్. మే 13న దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి దివ్యాంగ్ టక్కర్ డైరెక్షన్లో రిలీజ్ అయిన ఈ సినిమా కామెడీ దగ్గరనుంచి ఏ విషయంలోనూ ఆకట్టుకోలేకపోయింది. దాంతో సక్సెస్ ట్రాక్ నుంచి సైడ్ అయిపోయాడు స్టార్ హీరో రణవీర్ సింగ్.

హీరో పంతి, భాగీ, వార్ లాంటి సినిమాలతో బాలీవుడ్ ఆడియన్స్ లో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకున్న టైగర్ ష్రాఫ్. తన యాక్షన్ పవర్ ని చూపిస్తూ లాస్ట్ మంత్ రిలీజ్ చేసిన సినిమా హీరో పంతి2. ఈ సినిమాలో మాస్ ఆడియన్స్ కి కావల్సిన ఫైట్స్, మార్షల్ ఆర్ట్స్, మ్యాజిక్ ఎంతున్నా ఆడియన్స్ ని బోర్ కొట్టించారు. అందుకే ఆడియన్స్ ఏమాత్రం ఆలోచించకుడా 70 కోట్ల ఈ సినిమాని డిజాస్టర్ లిస్ట్ లో యాడ్ చేశారు.

300 కోట్ల కలెక్షన్లతో బాలీవుడ్ స్టార్ హీరోల్ని సర్ ప్రైజ్ చేసిన షాహిద్ కపూర్ కబీర్ సింగ్ తర్వాత రిలీజ్ చేసిన మూవీ జెర్సీ. తెలుగులో నాని తీసిన జెర్సీ సినిమాకి రీమేక్ గా, భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ స్పోర్ట్స్ డ్రామా బాలీవుడ్ ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. 40 కోట్లతో తెరకెక్కిన ఈ జెర్సీ దాదాపు 15 కోట్ల నష్టాల్ని మిగిల్చింది.

RRR లాంటి సినిమాలు ఎన్నొచ్చినా మా బాలీవుడ్ కి వచ్చిన ప్రాబ్లమ్ ఏం లేదంటూ సంచలన కామెంట్స్ చేసిన జాన్ అబ్రహం ఎన్నో అంచనాలతో రిలీజ్ చేసిన సినిమా ఎటాక్. పేట్రియాటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఏప్రిల్ 1న ప్రేక్షకులముందుకొచ్చిన ఈ ఎటాక్ మూవీ కంటెంట్ తో పెద్దగా ఆకట్టుకోలేక 70 కోట్ల బడ్జెట్ కి 20 కోట్ల కలెక్షన్లు రాబట్టి 50 కోట్ల భారీ నష్టాల్ని మూటకట్టుకుంది.

ఇక బాలీవుడ్ ఆడియన్స్ ప్రేమగా హిట్ మెషీన్ అని పిలుచుకునే స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా కంటెంట్ లేకపోతే కటౌట్ కి వాల్యూ లేదని ప్రూవ్ చేకున్నారు. సౌత్ లో సూపర్ హిట్ అయిన గద్దలకొండ గణేష్ ని హిందీలో బచ్చన్ పాండే గా రీమేక్ చేసిన అక్షయ్ కుమార్ ఈ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఫేస్ చేశారు. 180 కోట్ల బడ్జెట్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన బచ్చన్ పాండే కేవలం 70 కోట్లు మాత్రమే వసూల్ చేసి 100 కోట్లకు పైగా నష్టాల్ని మిగిల్చింది. అర్దం పర్దం లేని స్టోరీ లైన్, ఏమాత్రం బలం లేని స్క్రీన్ ప్లేతో తెరకెక్కిన బచ్చన్ పాండేని చూసి స్టార్ హీరో అక్షయ్ పై కూడా నెగెటివ్ కామెంట్స్ చేశారంటే సినిమా ఏ లెవల్లో ఉందో అర్దం చేస్కోవచ్చు.

నెల రోజుల క్రితం మెగాస్టార్ హీరోలు చిరంజీవి, చరణ్ లీడ్ రోల్స్ లో ఇప్పటి వరకూ ఫ్లాప్ ఎరగని డైరెక్టర్ కొరటాల డైరెక్షన్లో భారీగా రిలీజ్ అయిన ఆచార్య సినిమా అభిమానుల అంచనాలను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. రొటీన్ మూస మేకింగ్ తో పాటు స్టోరీ లైన్ అంత స్ట్రాంగ్ గా లేకపోవడంతో ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ వందకోట్ల సినిమా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసింది.

దాదాపు మూడేళ్ల నుంచి సినిమా కోసం వెయిట్ చేసిన ప్రభాస్ ఫాన్స్ 300కోట్లతో తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ చూసి డిసప్పాయింట్ అయ్యారు. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా ప్రతి చోటా ఫ్లాప్ టాక్ తోనే రన్ అయ్యింది రాధేశ్యామ్. కనీసం ప్యాన్ ఇండియా స్టార్, బాహుబలితో 2 వేలకోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన హీరో అన్న క్రేజ్ ని ఏమాత్రం కన్సిడర్ చెయ్యకుండా సినిమా కంటెంట్ బాలేదని నెగెటివ్ రిజల్ట్ ఇచ్చారు ప్రేక్షకులు. భారీ స్టార్ కాస్ట్, భారీ మేకింగ్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంలో ఎక్కడో మిస్ ఫైర్ అయ్యింది. అందుకే అంతంత మాత్రం కలెక్షన్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది రాధేశ్యామ్.

 

తమిళ్ స్టార్ హీరో విజయ్ లాస్ట్ ఇయర్ మాస్టర్ తో సూపర్ హిట్ ఇచ్చి ఈసారి లెక్క ఏమాత్రం తక్కువ కాకుండా బీస్ట్ మూవీలో యాక్షన్ ప్లాన్ చేశారు. భారీ బడ్జెట్ తో మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ తో ఏప్రిల్ 14న రిలీజ్ అయిన బీస్ట్ మూవీ రొటీన్ యాక్షన్ తో అంతగా ఆకట్టుకోలేకపోయింది. తమిళ్ లో కలెక్షన్స్ వచ్చినా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.

అజిత్ యాక్షన్ ఎంటర్ టైనర్ వలిమై ఆడియన్స్ పల్స్ పట్టుకోలేక డిజాస్టర్ అయ్యింది. టాప్ హీరో అజిత్ తన యాక్షన్ ని చూపించినా కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆడియన్స్. రేసింగ్ రాబరీ బ్యాక్ డ్రాప్ లో అజిత్, కార్తికేయ లీడ్ రోల్స్ లో తెరకెక్కిన వలిమై మూవీ ఫిబ్రవరి 24న తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో రిలీజ్ అయిన కూడా ఎక్కడా మంచి హిట్ టాక్ సంపాదించలేకపోయింది.

తమిళ్ లో వర్సెటైల్ క్యారెక్టర్స్ చేసే సూర్య సోషల్ ఇంట్రస్ట్ టాపిక్ తీసుకుని మాస్ ఎలిమెంట్స్ తో భారీ యాక్షన్ సినిమా ET మార్చి 10న ఆడియన్స్ ముందుకొచ్చారు. రెండేళ్లనుంచి పెద్దగా యాక్షన్ ని టచ్ చెయ్యని సూర్య ఈసారి యాక్షన్ మోత మెగించబోతున్నారని, క్లాస్, మాస్ ఇలా ఏదైనా ఎడాప్ట్ చేసుకునే సూర్య.. పంచెకట్టులో తన మాస్ యాంగిల్ ని మరోసారి గట్టిగానే చూపిస్తారని అనుకున్నా ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసింది.

 

Pawan Kalyan : హరిహర వీరమల్లు ఏమైంది?? షూటింగ్ ఎప్పుడు??

లేటెస్ట్ గా బాలీవుడ్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫేస్ చేసింది లేడీ సూపర్ స్టార్ కంగనా రనౌత్. దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన థాక్కడ్ సినిమాకు కనీసం 10 కోట్ల కలెక్షన్ కూడా రాలేదు. మే 20న రిలీజ్ అయిన కంప్లీట్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ధాకడ్ మూవీ సక్సెస్ కి కంగనా క్రేజ్ ఏమాత్రం కలిసి రాలేదు. దాంతో మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేక బాలీవుడ్ డిజాస్టర్ గా నిలిచింది. ఇలా స్టార్ హీరోలు, హీరోయిన్స్, బడ్జెట్ ఉన్నా సరైన కథ, స్క్రీన్ ప్లే లేక ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోతే ఫ్లాప్ మూట కట్టుకోవాల్సిందే అని ప్రేక్షకులు చెప్తున్నారు ఈ రిజల్ట్స్ తో.