IND vs AUS Test Match: గోల షురూ.. ఐసీసీ జోక్యం చేసుకోవాలట.. నాగ్‌పూర్ పిచ్‌పై అక్కసు వెళ్లగక్కిన ఆస్ట్రేలియా ..

ఆస్ట్రేలియా, భారత్ జట్ల మ్యాచ్ అంటే మాటల యుద్ధం షరామామూలే. గ్రౌండ్‌లో భారత్ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచేలా నోరుపారేసుకునే ఆసీస్ ఆటగాళ్లు.. ఈసారి మ్యాచ్ ప్రారంభంకు ముందే పిచ్‌పై గోల షురూ చేశారు. ఆసీస్ జట్టు ఆటగాడు స్టీవ్‌స్మిత్ నాగ్‌పూర్ పిచ్ గురించి మాట్లాడుతూ.. పిచ్ డ్రైగా ఉందని, లెఫ్టార్మ్ స్పిన్నర్లకు ఎక్కువ సహకరించే అవకాశం ఉందని అన్నారు.

IND vs AUS Test Match: గోల షురూ.. ఐసీసీ జోక్యం చేసుకోవాలట.. నాగ్‌పూర్ పిచ్‌పై అక్కసు వెళ్లగక్కిన ఆస్ట్రేలియా ..

IND vs AUS Match

IND vs AUS Test Match: ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య గురువారం నుంచి ప్రతిష్టాత్మక బోర్డర్ – గవస్కర్ ట్రోపీ షురూ కానుంది. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మ్యాచ్ అంటే మాటల యుద్ధం షరామామూలే. గ్రౌండ్‌లో భారత్ ఆటగాళ్లపై ఒత్తిడి పెంచేలా నోరుపారేసుకునే ఆసీస్ ఆటగాళ్లు.. ఈసారి మ్యాచ్ ప్రారంభంకు ముందే గోల షురూ చేశారు. నాగ్‌పూర్ గ్రౌండ్‌లో పిచ్ భారత్ జట్టు వారికి అనుకూలంగా తయారు చేసుకుందంటూ ఆసీస్ జట్టు నిపుణులు, ఆటగాళ్లు అక్కసు వెల్లగక్కారు.

IND vs AUS Test Match : తొలి టెస్టులో నలుగురు స్పిన్నర్లు..! ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన రోహిత్ శర్మ

ఆసీస్ జట్టు ఆటగాడు స్టీవ్‌స్మిత్ నాగ్‌పూర్ పిచ్ గురించి మాట్లాడుతూ.. పిచ్ డ్రైగా ఉందని, లెఫ్టార్మ్ స్పిన్నర్లకు ఎక్కువ సహకరించే అవకాశం ఉందని అన్నారు. పిచ్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. దీంతో ఆస్ట్రేలియా మాజీలు తమ అక్కసును వెళ్లగక్కారు. ఇలాంటి పిచ్‌ల విషయంలో ఐసీసీ జోక్యం చేసుకోవాలంటూ పలువురు ఆసీస్ మాజీలు కోరారు. ఈ పిచ్ విషయంలో ఏదైనా సరైనది కాదని భావిస్తే ఐసీసీ జోక్యం చేసుకొని పరిశీలించాలని మాజీ ఆసీస్ ఆటగాడు సైమన్ ఓడానెల్ అన్నారు.

Ind vs Aus Test : ఆ ఇద్దరు ఇండియన్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కొనేందుకు ఆస్ట్రేలియా జట్టు ప్రత్యేక కసరత్తు ..

ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్టు మధ్య మ్యాచ్ సందర్భంలో కంగారు జట్టు ఆటగాళ్లు, మాజీలు ప్రతీసారి ఇలాంటి విమర్శలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. గతంలోనూ పలుసార్లు ఇండియాలోని పలు గ్రౌండ్ ల పిచ్‌లపై ఆస్ట్రేలియా మాజీలు తమ అక్కసును వెళ్లగక్కారు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు, జట్టు సభ్యుల వ్యాఖ్యలను టీమిండియా మాజీ ఆటగాళ్లు తప్పుబట్టారు. ప్రతిసారీ అతిథ్య జట్టుపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఆస్ట్రేలియాకు అలవాటేనని కొట్టిపారేస్తున్నారు.