Puneeth Rajkumar : పునీత్‌ పేరుతో ఉచిత ఆస్పత్రి, పాఠశాల : గాలి జనార్దనరెడ్డి

బళ్లారి నగరంలో పునీత్‌రాజ్‌కుమార్‌ పేరుతో ఉచిత ఆస్పత్రి, పాఠశాలను నిర్మిస్తామన్నారు. తమ సొంత నిధులతో పేదలకు ఆయన పేరుతో సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు. పునీత్‌రాజ్‌కుమార్‌ మరణం

Puneeth Rajkumar : పునీత్‌ పేరుతో ఉచిత ఆస్పత్రి, పాఠశాల : గాలి జనార్దనరెడ్డి

Puneeth

Puneeth Rajkumar :  కన్నడ పవర్ స్టార్ పునీత్ మరణం తర్వాత ఆయన సమాధిని చూడటానికి రోజూ వేలల్లో అభిమానులు, ప్రజలు వస్తున్నారు. పునీత్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు, కొంతమంది కర్ణాటక ప్రముఖులు పునీత్ పేరుతో సేవా కార్యక్రమాలని చేపడుతున్నారు. నిన్నటికి ఆయన మరణించి 11 రోజులు కావడంతో ఆయన జ్ఞాపకంగా పునీత్ అభిమానులు కర్ణాటకలో పలు చోట్ల అన్నదానాలు నిర్వహించారు. అంతే కాక నేత్రదాన శిబిరాలు కూడా నిర్వహించారు. కర్ణాటక ఎమ్మెల్యేలు ఈ నేత్రదాన శిబిరాల్లో పాల్గొని పునీత్ పేరుతో చేసే సేవ కార్యక్రమాల్లో వారు కూడా పాలు పంచుకుంటామని తెలిపారు.

Bigg Boss 5: బిగ్ బాస్ నుంచి జెస్సి అవుట్.. షాక్ లో షన్ను, సిరి

నిన్న సోమవారం గాలి జనార్దనరెడ్డి బళ్లారిలో బెళగల్‌ క్రాస్‌లోని రుక్మిణమ్మ చెంగారెడ్డి వృద్ధాశ్రమంలో పునీత్‌రాజ్‌కుమార్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బళ్లారి నగరంలో పునీత్‌రాజ్‌కుమార్‌ పేరుతో ఉచిత ఆస్పత్రి, పాఠశాలను నిర్మిస్తామన్నారు. తమ సొంత నిధులతో పేదలకు ఆయన పేరుతో సేవా కార్యక్రమాలు చేపడతానన్నారు. పునీత్‌రాజ్‌కుమార్‌ మరణం యావత్తు కర్ణాటక ప్రజలను దుఃఖ సాగరంలో నింపిందని, ఆయనకు ఎన్ని అవార్డులు వచ్చినా తక్కువేనని కర్ణాటక మాజీ మంత్రి గాలిజనార్ధన్‌రెడ్డి అన్నారు.

Liger : లైగర్ కోసం బాలయ్య, అమితాబ్.. పూరి పర్ఫెక్ట్ ప్లాన్

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాలిసోమశేఖరెడ్డి, బుడా చైర్మన్‌ పాలన్న, గాలిజనార్ధన్‌రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గాలిసోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. పునీత్‌ మరణం తీరనిలోటని, పునీత్‌తో తమకు ఎంతో అవినాభవ సంబంధం ఉందని చెప్తూ బళ్లారి నగరంలోని రాయల్‌ బస్టాండ్‌కు పునీత్‌ పేరు పెడతామని అన్నారు.