Yadadri RTC Buses : యాదాద్రి కొండపైకి వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కొండపైకి వెళ్లడానికి, తిరిగి కిందకు రావడానికి ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సేవలు అందించనున్నారు.

Yadadri RTC Buses : యాదాద్రి కొండపైకి వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

Yadadri Bus

Free travel on RTC buses : ఇటీవల పునఃప్రారంభమైన యాదాద్రి ఆలయంలో భక్తులకు ఉచిత సేవలు అందించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కొండపైకి వెళ్లడానికి, తిరిగి కిందకు రావడానికి ఆర్టీసీ బస్సుల ద్వారా ఉచిత సేవలు అందించనున్నారు. ఈ సేవలు నేటి నుంచే అందుబాటులోకి వచ్చినట్లు ఆలయ ఈవో తెలిపారు. భ‌క్తుల త‌ర‌లింపున‌కు అయ్యే వ్యయాన్ని దేవ‌స్థాన‌మే భ‌రిస్తుంద‌ని ఈవో స్పష్టం చేశారు.

కొండ‌పైకి వెళ్లే ప్రైవేటు వాహ‌నాల‌ను యాదాద్రి దేవ‌స్థానం నిషేధించింది. భక్తులు దర్శనానికి వచ్చేందుకు కొండపైకి ద్విచక్రవాహనాలు మొదలుకొని కార్లు, జీపులు, ప్రైవేట్ బస్సులను కొండపైకి నిషేధించినట్టు తెలిపారు. నేటి నుంచి ప్రతినిత్యం కొండపైకి, కొండ దిగువకు వెళ్లేందుకు ఆర్టీసీ సేవలు అందిస్తోంది.

Yadadri Mini Buses : ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక మినీ ఆర్టీసీ బస్సులు

ఇక త్వర‌లోనే యాదాద్రి ఆల‌యంలో స్వామివారి నిత్యక‌ల్యాణం, బ్రహ్మోత్సవం, శాశ్వత క‌ల్యాణం. శాశ్వత బ్రహ్మోత్సవం, సుద‌ర్శన నార‌సింహ హోమంతో పాటు మొక్కు జోడు సేవ‌లు కూడా ప్రారంభిస్తామ‌ని ఈవో తెలిపారు.