Tank Bund : గణేష్ నిమజ్జనం, ట్యాంక్ బండ్‌‌పై 40 క్రేన్లు..ప్రత్యేక నిఘా

గణేశ్‌ నిమజ్జనానికి ఇక ఒక్క రోజే మిగిలి ఉంది. ఇన్ని రోజులు భక్తుల పూజలందుకున్న విఘ్నేశ్వరుడు... 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం గంగ ఒడికి చేరుకోనున్నాడు.

Tank Bund : గణేష్ నిమజ్జనం, ట్యాంక్ బండ్‌‌పై 40 క్రేన్లు..ప్రత్యేక నిఘా

Ganesh

Ganesh Nimajjanam : గణేశ్‌ నిమజ్జనానికి ఇక ఒక్క రోజే మిగిలి ఉంది. ఇన్ని రోజులు భక్తుల పూజలందుకున్న విఘ్నేశ్వరుడు… 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం గంగ ఒడికి చేరుకోనున్నాడు. దీంతో హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తోంది జీహెచ్‌ఎంసీ. నిమజ్జనం కోసం తరలివచ్చే  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. గణపతుల నిమజ్జనాల కోసం ట్యాంక్‌బండ్‌పై భారీ ఏర్పాట్లు చేస్తోంది బల్దియా. ఈసారి ట్యాంక్‌బండ్‌పై 40 క్రేన్ల ద్వారా లంబోదరుడి ప్రతిమలు నిమజ్జనం చేయనున్నారు. ఖైరతాబాద్‌ గణనాథుడిని క్రేన్‌ నంబర్‌ 6 దగ్గర నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Read More : Gujarat : బిస్కెట్ ప్యాకెట్లతో శివలింగం..మధ్యలో వినాయకుడు

ఆదివారం నగర వ్యాప్తంగా శోభాయమానంగా గణేశ్‌ విగ్రహాల నిమజ్జనం నిర్వహించనున్నారు.గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పరిశీలించారు.  ట్యాంక్‌బండ్‌పైనే ఆయన అధికారులతో సమీక్షించారు.  హైకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులను భారీగా మోహరిస్తున్నారు. 19వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు.

Read More : Supreme Court : హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి

శోభాయాత్ర జరిగే మార్గంలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వాటిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేసి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది బల్దియా. మంచినీరు, ఆహార ప్యాకెట్లను సరఫరా  చేయనున్నట్టు తెలుస్తోంది. నిమజ్జనం కోసం ఆరోగ్య, శానిటరీ సిబ్బంది, ఆర్‌ అండ్‌ బీ, హెచ్‌ఎండీఏ సిబ్బంది విధుల్లో ఉంటున్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిమజ్జనం నిర్వహించనున్నారు బల్దియా అధికారులు.

Read More : Youngster Died : వినాయక మండపం వద్ద డ్యాన్స్‌ చేస్తూ యువకుడు మృతి

ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్‌ గ్రూప్‌ను కూడా ఏర్పాటు చేశారు.ఇప్పటికే చాలా వరకు గణపతి విగ్రహాలు నిమజ్జనం చేశారు. భారీ గణపతి విగ్రహాలను మాత్రమే ఉంచారు. వీటన్నింటిని రేపు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. భక్తులంతా మాస్క్ లు ధరించి రావాలని అధికారులు సూచిస్తున్నారు.