Gujarat : బిస్కెట్ ప్యాకెట్లతో శివలింగం..మధ్యలో వినాయకుడు

ఇంట్లో జరిగిన ఫంక్షన్ లో చాలా ఆహారం వృథా అయ్యిందని, ప్రతి రోజు మూడోవంతు ఆహారం వృథా అవుతోందంటున్నారు వడోదరకు చెందిన రాధిక సోని అనే మహిళ.

Gujarat : బిస్కెట్ ప్యాకెట్లతో శివలింగం..మధ్యలో వినాయకుడు

Ganesh

Ganesha Idol : ఫుడ్ వేస్ట్ చేయొద్దు…అంటుంటారు. కానీ చాలా మంది తినే ఆహారం వేస్ట్ చేస్తున్నారు. ప్రపంచ జనాభాకు అనుగుణంగా..సరిపోయే ఆహారం ప్రస్తుతం లేదని, ఆహారపు కొరత విపరీతంగా ఉందంటున్నారు నిపుణులు. ఆహారాన్ని చాలా మంది వృథా చేస్తుండడంతో పండిన పంట సగం నేల పాలువుతోంది. ఈ వృథాను అరికట్టాలని..అప్పుడే ఆహారం కొరత ఏర్పడదంటున్నారు. ఆహారం వృథాపై అవగాహన కల్పించడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వినాయక చవితి సందర్భంగా…గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ…వినూత్నంగా గణనాథుడిని అలంకరించింది. బిస్కెట్ ప్యాకెట్లతో ఆమె చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందిస్తున్నారు.

Read More : Ganesh : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనంపై గందరగోళం

ఇటీవలే ఇంట్లో జరిగిన ఫంక్షన్ లో చాలా ఆహారం వృథా అయ్యిందని, ప్రతి రోజు మూడోవంతు ఆహారం వృథా అవుతోందంటున్నారు వడోదరకు చెందిన రాధిక సోని అనే మహిళ. అందులో భాగంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వినాయకుడిని బిస్కెట్ ప్యాకెట్లతో అలంకరించడం జరిగిందన్నారు. బిస్కెట్ ప్యాకెట్లతో అందంగా శివలింగాన్ని తయారు చేసి…ఆ లింగం మధ్యలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

Read More :Chocolate Ganesh : తియ్యతియ్యని 200 కేజీల చాక్లెట్ వినాయకుడు

1008 బిస్కెట్ ప్యాకెట్లు, 850 రుద్రాక్షలను ఉపయోగించారు. 5 అడుగుల శివలింగం తయారు చేశారు. వినాయకుడిని నిమజ్జనం చేసిన అనంతరం బిస్కెట్ ప్యాకెట్లను పేద పిల్లలకు పంచుతానంటున్నారు రాధికా. ఈమె ఆలోచనను స్థానికులు మెచ్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.