Supreme Court : హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు అనుమతిచ్చింది సుప్రీం కోర్టు.

Supreme Court : హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి

Supreme Court

Supreme Court : ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు అనుమతిచ్చింది సుప్రీం కోర్టు. జీహెచ్ఎంసీ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం హుస్సేన్ సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి ఇస్తూ తీర్పు ఇచ్చింది.

Read More : High Court : గణేష్ మండపాలు, విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

అంతకు ముందు తెలంగాణ హైకోర్టు పీఓపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసేందుకు అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ ఒక్క ఏడాది నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలని కోరింది. విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్.వి రమణ, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం నిమజ్జనానికి అనుమతి ఇచ్చింది. ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది.

కాగా వినాయక విగ్రహాల ఏర్పాటుకు ముందే తెలంగాణ హై కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసేలా ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతి నిరాకరించాలని ప్రభుత్వానికి సూచించింది.

Read More : Eve Teasing : సరదాగా చున్నీ లాగాను అన్న ఆకతాయి..ఏడాది జైలుశిక్ష వేసిన కోర్టు

అయితే హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అంశంపై జీహెచ్ఎంసీ హైకోర్టుకు వెళ్ళింది. మొదట ఇచ్చిన తీర్పులో ఎటువంటి మార్పులు చేయమని, హుస్సేన్ సాగర్ లో పీఓపీ విగ్రహాలు వేసేందుకు అనుమతి లేదని తెలిపింది. ఇక ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు బాటపట్టింది జీహెచ్ఎంసీ. గురువారం విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ ఏడాది హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి అనుమతించింది.