Sourav Ganguly: బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీకి కీలక బాధ్యతలు ..
త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా గంగూలీని నియమిస్తూ త్రిపుర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Sourav Ganguly,
Sourav Ganguly: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మరో కీలక బాధ్యత చేపట్టనున్నారు. ఆయన్ను త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ త్రిపుర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సుశాంత చౌదరి కోల్ కతాలోని గంగూలీ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు గంగూలీ సుముఖత వ్యక్తం చేశారు. అనంతరం సుశాంత్ చౌదరి మాట్లాడుతూ.. గంగూలీ రాష్ట్రానికి విజయవంతమైన బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటారని త్రిపుర ప్రభుత్వం విశ్వసిస్తోందని తెలిపారు.
గంగూలీ మాట్లాడుతూ.. త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బాధ్యతలను చేపట్టబోతున్నానని అధికారికంగా ప్రకటించారు. ఈ విషయంపై త్రిపుర సీఎం మాణిక్ సాహా స్పందించారు. త్రిపుర రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనే తమ ప్రతిపాదనను గంగూలీ అంగీకరించడం సంతోషంగా ఉందని అన్నారు. గంగూలీతో నేను ఫోన్ లో మాట్లాడానని చెప్పారు. గంగూలీ భాగస్వామ్యం కచ్చితంగా త్రిపుర రాష్ట్ర పర్యాటక రంగానికి ఊపునిస్తుందని భావిస్తున్నామని అన్నారు.