Gautham Vasudev Menon : నాకు తెలియకుండా వాళ్ళ సినిమాలో నన్ను అనౌన్స్ చేశారు : గౌతమ్ వాసుదేవ్ మీనన్

ఈ పోస్టర్ పై గౌత‌మ్ మీన‌న్ అంద‌రికీ షాకిచ్చే స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా పోస్టర్ ని షేర్ చేస్తూ.. ఈ సినిమా గురించి నాకు తెలీదు. ఇది నాకు ఆశ్చ‌ర్యం క‌లిగించే వార్త‌. ఈ సినిమాలో

Gautham Vasudev Menon : నాకు తెలియకుండా వాళ్ళ సినిమాలో నన్ను అనౌన్స్ చేశారు : గౌతమ్ వాసుదేవ్ మీనన్

Gautham

Updated On : November 5, 2021 / 12:30 PM IST

Gautham Vasudev Menon :  లవ్ సినిమాలను స్టైలిష్ గా తీయాలన్నా, సస్పెన్స్ సినిమాలు పర్ఫెక్ట్ గా తీయాలన్నా గుర్తొచ్చే ఫస్ట్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్. డైరెక్టర్ గా తాను ఎన్నో సినిమాలు విజయం సాధించాడు. గత కొద్ది సంవత్సరాలుగా డైరెక్షన్ తో పాటు యాక్టింగ్ కూడా చేస్తూ జనాల్ని మెప్పిస్తున్నారు. తన సినిమాలతో పాటు వేరే సినిమాల్లో కూడా గౌతమ్ యాక్ట్ చేస్తున్నారు. యాక్టింగ్ కూడా అద్భుతంగా చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తమిళ్ లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రగా అన్బు సెల్వ‌న్ అనే చిత్రాన్ని ప్రకటించారు.

Bigg Boss Swetha : లక్ష రూపాయలిచ్చి నన్ను కమిట్‌మెంట్ అడిగారు : బిగ్ బాస్ శ్వేత

తాజాగా నిన్న దీపావళి సందర్భంగా ఈ సినిమా నుంచి మరో పోస్టర్ ని రిలీజ్ చేశారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు ఆయన చిత్రాలతో పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. అయితే ఈ పోస్టర్ పై గౌత‌మ్ మీన‌న్ అంద‌రికీ షాకిచ్చే స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఈ సినిమా పోస్టర్ ని షేర్ చేస్తూ.. ఈ సినిమా గురించి నాకు తెలీదు. ఇది నాకు ఆశ్చ‌ర్యం క‌లిగించే వార్త‌. ఈ సినిమాలో ఎలా న‌టిస్తున్నానో తెలియ‌దు. ఈ పోస్ట‌ర్ లో ఉన్న డైరెక్ట‌ర్ ఎవ‌రో నాకు తెలియ‌దు, ఆ డైరెక్ట‌ర్ ను నేను క‌లువ‌లేదు. నిర్మాత‌లు ట్వీట్ చేయ‌డానికి పెద్ద పేర్ల‌ను వాడుకున్నారు. ఇది షాకింగ్‌గా ఉంది. అంత సుల‌భంగా ఇలా ఎలా చేస్తారో భ‌యంగా ఉంది అంటూ పోస్ట్ చేశారు గౌత‌మ్ మీన‌న్. ఇప్పుడు ఈ స్టార్ డైరెక్ట‌ర్ చేసిన కామెంట్లు తమిళ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. మ‌రి గౌత‌మ్ మీన‌న్ కామెంట్స్ పై సినిమా మేక‌ర్స్ స్పందిస్తారేమో చూడాలి. గతంలో కూడా ఇదే సినిమాని గౌతమ్ మీనన్ ఫొటోతో అనౌన్స్ చేయడం విశేషం.