బంగ్లాదేశ్ యుద్ధ ఖైదీల‌కు రెండేళ్లు తిండిపెట్టాం కానీ..మ‌న రైతుల‌కు నీళ్లు కూడా ఇవ్వ‌ట్లేదు..

బంగ్లాదేశ్ యుద్ధ ఖైదీల‌కు రెండేళ్లు తిండిపెట్టాం కానీ..మ‌న రైతుల‌కు నీళ్లు కూడా ఇవ్వ‌ట్లేదు..

Ghazipur barricades look Berlin Wall : బంగ్లాదేశ్ యుద్ధ ఖైదీల‌కు రెండేళ్లు తిండిపెట్టామ‌ని, కానీ మ‌న స్వంతదేశంలో మన రైతుల‌కు కనీసం తాగటానికి నీళ్లు కూడా ఇవ్వ‌డం లేద‌నీ..ఘాజీపూర్‌లో ఉన్న బారికేడ్లు బెర్లిన్ గోడ‌లా ఉన్నాయ‌న్నాని పంజాబ్ కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ పార్లమెంట్ లో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదేనా ప్ర‌పంచంలోని అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఆఫ్ఘినిస్తాన్‌, ఇరాక్‌, లిబియాలో క‌నిపించే దృశ్యాల్లా ఉన్నాయ‌ని రైతుల పట్ల వ్యవహరించే తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న పోరాటాలను ప్రభుత్వం ఎలాగైనా సరే అణిచివేయాలని చూస్తోంది. రైతుల నిరసనల్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నా అంతకంతకూ ఉదృతమవుతూనే ఉంది. కేంద్రం ఎన్నిసార్లు రైతులతో చర్చలు జరిపినా ఫలితాలు మాత్రం ఎగడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. రైతులకు ఎంత మద్ధతు వస్తోందో ప్రభుత్వంమీద అన్ని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై పంజాబ్ ఎంపీ ప్ర‌తాప్ సింగ్ బాజ్వా పార్లమెంట్ లో తీవ్రంగా విమ‌ర్శించారు.

ఘాజీపూర్‌లో రైతులు నిర‌స‌న చేస్తున్న ప్ర‌దేశంలో పోలీసులు బారికేడ్లు అవి బారికేడ్లు లేవని అవి బెర్లిన్ గోడ‌లా ఉన్నాయ‌ని ఎంపీ ప్ర‌తాప్ సింగ్ బాజ్వా విమ‌ర్శించారు. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదం తీర్మానం సంద‌ర్భంగా ప్రతాప్ సింగ్ రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ప్రభుత్వం అప్ర‌జాస్వామిక ప‌ద్ధ‌తిలో స‌భ‌లో రైతు చ‌ట్టాల‌ను పాస్ చేశార‌ని ఆరోపించారు.

ఓటింగ్ స‌మ‌యంలో డివిజ‌న్ చేప‌ట్టే ఆప్ష‌న్ కూడా ఇవ్వ‌లేద‌నీ ఇది సరైందికాదని అన్నారు. దేశ‌మంతా కోవిడ్‌19, లాక్‌డౌన్‌తో స‌త‌మ‌తం అవుతుంటే..ప్రభుత్వం మాత్రం దొడ్డిదారిలో రైతు చ‌ట్టాల‌ను ఆమోదం చేసిందని ఆరోపించారు. రైతులు స్వ‌తాహాగా ఆందోళ‌న చేప‌డుతున్నారు..వారిని ఎవ్వరూ వెనకుండి నడిపించటంలేదు. నిర‌స‌న‌ల కోసం గ్రామ‌స్థుల నుంచి డ‌బ్బులు సేక‌రిస్తున్నారు..వారి పొలాలను వారి భార్యలకు వదిలేసి రైతులు తమ హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నారని అన్నారు.

బంగ్లాదేశ్ యుద్ధ ఖైదీల‌కు రెండేళ్లు తిండిపెట్టామ‌ని, కానీ మ‌న స్వంత రైతుల‌కు నీళ్లు ఇవ్వ‌డం లేద‌ని విమర్శించారు. ఘాజీపూర్‌లో ఉన్న బారికేడ్లు బెర్లిన్ గోడ‌లా ఉన్నాయ‌నీ..ప్ర‌పంచంలోని అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మ‌ంటే ఇదేనా? అని ప్ర‌శ్నించారు. ఆఫ్ఘినిస్తాన్‌, ఇరాక్‌, లిబియాలో క‌నిపించే దృశ్యాల్లా ఉన్నాయ‌న్నారు.

18 నెల‌ల పాటు ఆ చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌మ‌ని ప్ర‌భుత్వం చెబుతోందనీ..కానీ ఆ చ‌ట్టాల‌ను ఎందుకు ర‌ద్దు చేయడం లేద‌ని ప్రతాప్ సింగ్ ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని మోదీ ఓ రాజ‌నీత‌జ్ఞుడిగా మారేందుకు ఇదో స‌దావ‌కాశం అని..దాన్ని మోడీ నిరూపించుకోవాలని అన్నారు. దేశంలో రెండ‌వ స‌ర్దార్ ప‌టేల్ కావాల‌ని ప్రధాని అనుకుంటూ వెంటనే ఢిల్లీ స‌రిహ‌ద్దుకు వెళ్లి రైతుల‌ను క‌లుసుకోవాల‌నీ..వారితో చర్చలు జరపాలని సూచించారు. సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తామ‌ని వారికి హామీ ఇవ్వాల‌ని ఈసందర్భంగా పంజాబ్ ఎంపీ ప్రతాప్ సింగ్ డిమాండ్ చేశారు.