GHMC Fine for To-Let Board: ‘టూ లెట్‌’ బోర్డు పెట్టారా.. అయితే రూ.2 వేలు జరిమానా కట్టాల్సిందే..

వ్యాపార, వాణిజ్య, ఇల్లు వంటివి అద్దెకు ఇవ్వబడును అనే పేరుతో ఏర్పాటు చేసే బోర్డులు, వాల్ పోస్టర్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానా విధించనున్నారు.

GHMC Fine for To-Let Board: ‘టూ లెట్‌’ బోర్డు పెట్టారా.. అయితే రూ.2 వేలు జరిమానా కట్టాల్సిందే..

Tolet

Updated On : August 25, 2021 / 12:20 PM IST

GHMC fine on ‘TO-LET’ board : వ్యాపార, వాణిజ్య, ఇల్లు వంటివి అద్దెకు ఇవ్వబడును అనే పేరుతో ఏర్పాటు చేసే బోర్డులు, వాల్ పోస్టర్లకు జీహెచ్‌ఎంసీ అధికారులు జరిమానా విధించనున్నారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసే బహిరంగ ప్రచారాలపై ఇప్పటికే నిషేధం ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. మూసాపేట డివిజన్‌ పరిధిలోని ఓ దుకాణ యజమాని ఏర్పాటు చేసిన ‘టు లెట్‌’ స్టిక్కర్‌కు అధికారులు రూ.2 వేల జరిమానా విధించారు. ఈ మేరకు మంగళవారం నోటీసులు జారీ చేశారు.

మోతీనగర్‌ పరిధిలోని పాండురంగానగర్‌ చౌరస్తాలో స్థానిక వ్యాపారి ఎరమల్ల లాలయ్య గౌడ్‌ ఒక దుకాణంలో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. దాని పక్కనే ఉన్న అతని మరో దుకాణం ఫిబ్రవరిలో ఖాళీ అయ్యింది. దీంతో ఆయన ‘టు లెట్‌’ పేరుతో తన ఇంటి గోడకు పోస్టర్ అంటించారు.

దీన్ని నేరంగా పరిగణించిన జీహెచ్‌ఎంసీ ఈడీ, డీఎం డైరెక్టర్‌ అందుకు రూ.2 వేల జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేశారు. 24 గంటల్లో ఈ-చలానా ద్వారా జరిమానా చెల్లించాలని అందులో వెల్లడించారు.