Airport: ప్రపంచస్థాయిలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్.. రూ. 6300కోట్ల పెట్టుబడి

ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంని నిలపబోతున్నట్లు ప్రకటించారు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌

Airport: ప్రపంచస్థాయిలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్.. రూ. 6300కోట్ల పెట్టుబడి

Airport

Airport: ప్రపంచంలోనే అత్యుత్తమ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్లో ఒకటిగా శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంని నిలపబోతున్నట్లు ప్రకటించారు జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌, హైదరాబాద్‌ డిప్యూటీ సీఈవో ఆంటోనియో కొంబ్రెజ్‌. తెలంగాణలో ఉన్న జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుని సర్వహంగులతో ఆధునీకరించబోతున్నామని, ఇందుకోసం భారీ ఎత్తున నిధులు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు.

శంషాబాద్‌లో ఉన్న ఈ ఎయిర్‌పోర్టుని రూ. 6,300 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నట్టు వెల్లడించారు ఆంటోనియో కొంబ్రెజ్‌. ఏడాదికి 34 లక్షల మంది ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా ప్రయాణిస్తూ ఉండగా.. వారి రద్దీకి తగ్గట్టుగానే సౌకర్యాలు కల్పిస్తూ.. పెద్దఎత్తున పెట్టుబడి పెట్టి ఆధునికీకరించబోతున్నట్లు చెప్పారు. ఫ్రాన్స్‌లో ఉన్న ప్యారిస్‌లో ఓర్లీ ఎయిర్‌పోర్టుకి ధీటుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మారనుందని ఫ్రాన్స్‌కి చెందిన పారిశ్రామికవేత్తలతో ఆంటోనియో కొంబ్రెజ్‌ చెప్పారు.

భారీ పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా ఫ్రాన్స్‌ పారిశ్రామికవేత్తలు, రాయబారులతో కూడిన టీమ్ ఇటీవల హైదరాబాద్‌లో పర్యటన చేసింది. ఈ సంధర్భంగా మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశమవగా.. ఈ సమయంలోనే పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్‌లో ఉన్న వసతులు, అనుకూలతల గురించి వివరించింది తెలంగాణ ప్రభుత్వం.

పారిశ్రామికవేత్తలు భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉంటే మాత్రం దేశంలో మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రోత్సాహం ఇస్తామని మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. ఇప్పటికే జార్జ్‌ మోనిన్‌ సంస్థ హైదరాబాద్‌లో ఉన్న తమ ప్లాంటును రూ. 200 కోట్లతో విస్తరించాలని నిర్ణయించగా.. ఇదే తరహాలో కంపెనీలు వస్తాయని చెబుతున్నారు అధికారులు.