Goa Assembly Election : ప్రతి పేదవాడికి నెలకు రూ. 6 వేలు.. రాహుల్ వరాలు

ఈసారి హాంగ్‌ లాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా గెలవాలని భావిస్తోన్న కాంగ్రెస్‌.. రాహుల్‌ గాంధీ ప్రచారంతో జోరు మీదున్నట్లుగా కనిపిస్తోంది. గోవా ఎన్నికల ప్రచారంలో...

Goa Assembly Election : ప్రతి పేదవాడికి నెలకు రూ. 6 వేలు.. రాహుల్ వరాలు

Goa Congress

Goa Assembly Election 2022 : ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అధికా పీఠం చేజిక్కించుకోవాలని ప్రధాన పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. కమలం వికసించకుండా చేయాలని ఆ పార్టీ ఎన్నికల వ్యూహాలు రచిస్తోంది. ప్రధానంగా గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించినా..అధికారంలోకి రాలేకపోయింది కాంగ్రెస్. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో గెలవాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ భావిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే పేద‌ల‌కు ప్రతి నెల 6వేల రూపాయల చొప్పున అంద‌జేస్తామ‌ని రాహుల్ హామీ ఇచ్చారు. గోవా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడడంతో అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయి. ఈ సారైనా తాము అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

Read More : Tirupati : స్నేక్ క్యాచర్ సురేశ్ సేఫ్..ప్రాణాపాయం లేదన్న వైద్యులు

జోరుగా ప్రచారం చేస్తోంది. కమలం వ్యూహంతో గత ఎన్నికల్లో హస్తం చిత్తయింది. ఈసారి హాంగ్‌ లాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా గెలవాలని భావిస్తోన్న కాంగ్రెస్‌.. రాహుల్‌ గాంధీ ప్రచారంతో జోరు మీదున్నట్లుగా కనిపిస్తోంది. గోవా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌.. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందంటూ విమర్శలు గుప్పించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయండంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్. గత ఎన్నికల్లో చేసిన తప్పిదాలను ఈ సారి జరగకుండా చూసుకుంటామన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాము నియంతలకు టికెట్లు ఇవ్వడం లేదన్నారు. కొత్త వారికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో భారీ మేజార్టీతో ఘన విజయం సాధిస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. మరి రాహుల్ హామీలను ఓటర్లు విశ్వసిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

Read More : VJ Sunny : VJ సన్నీ ‘సకల గుణాభిరామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

గోవాలో బీజేపీ అధికారంలో ఉండగా, ప్రతిపక్షంలో గోవా ఫార్వర్డ్ పార్టీ, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ, కాంగ్రెస్ ఉన్నాయి. గోవాలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 21 స్థానాల మెజార్టీ ఉండాలి. బీజేపీ కూటమికి 25 స్థానాలుండగా, కాంగ్రెస్‌కు రెండు, ఇతరులకు ఏడు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించకపోయినప్పటికీ.. ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈసారి తృణమూల్ కూడా గోవా ఎన్నికల బరిలో దిగుతోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ పోటీచేస్తున్నట్టు ప్రకటించింది. గత ఎన్నిలతో పోలిస్తే.. ఇప్పటికి కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది.

Read More : Weather Forecast : శని, ఆదివారాల్లో హైదరాబాద్ లో పెరగనున్న చలిపులి- ఏపీలో పొడి వాతావరణం

గోవాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 40
మ్యాజిక్ ఫిగర్ 21
మనోహర్ పారికర్ లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలు