Telangana Jobs : నిరుద్యోగుల‌కు తెలంగాణ ప్రభుత్వం మ‌రో శుభవార్త

తెలంగాణ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు వ‌రుస‌గా గుడ్ న్యూస్ లు చెబుతోంది. ఇప్ప‌టికే 80వేల పైచిలుకు ఉద్యోగాల భ‌ర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వగా..

Telangana Jobs : నిరుద్యోగుల‌కు తెలంగాణ ప్రభుత్వం మ‌రో శుభవార్త

Telangana Jobs

Telangana Jobs : తెలంగాణ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు వ‌రుస‌గా గుడ్ న్యూస్ లు చెబుతోంది. ఇప్ప‌టికే 80వేల పైచిలుకు ఉద్యోగాల భ‌ర్తీకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వగా, తొలి విడ‌త‌లో భాగంగా 30వేల 453 ఉద్యోగాల భ‌ర్తీకి తెలంగాణ ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతులు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా రెండో విడ‌త‌లో భాగంగా బుధ‌వారం మ‌రో 3వేల 334 ఉద్యోగ నియామకాలకు అనుమతి ఇస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రెండో విడ‌త‌లో ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన వాటిలో ఎక్సైజ్‌, ఫారెస్ట్‌, అగ్నిమాప‌క శాఖ‌ల‌కు చెందిన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి అనుమ‌తి ఇచ్చిన ఆర్థిక శాఖ‌.. మిగిలిన శాఖ‌ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భ‌ర్తీకి సంబంధించిన అనుమ‌తుల‌పై దృష్టి సారించింది. ఆర్థిక శాఖ నుంచి అనుమ‌తి ల‌భించిన ఉద్యోగాల భ‌ర్తీకి త్వ‌ర‌లోనే నోటిఫికేష‌న్లు జారీ కానున్నాయి.

తెలంగాణ‌లో ఉద్యోగ నియామ‌క ప్రక్రియ మొద‌లు కాగా… నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వం మరో తీపి క‌బురు చెప్పింది. ఉద్యోగాల భ‌ర్తీ కోసం సిద్ధ‌మ‌వుతున్న నిరుద్యోగుల‌కు వ‌యో ప‌రిమితిని మూడేళ్లు పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే అన్ని ర‌కాల ఉద్యోగాల‌కు కాకుండా కేవ‌లం యూనిఫాం ఉద్యోగాల‌కు మాత్ర‌మే ఈ వ‌యో ప‌రిమితి పెంపు వ‌ర్తిస్తుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది.

Employment in Telangana: తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు: పోలీసు పోస్టులకు వయోపరిమితి పెంపు

తెలంగాణ సాధార‌ణ ప‌రిపాల‌న శాఖ జారీ చేసిన ఉత్త‌ర్వుల ప్ర‌కారం పోలీస్‌, ఎక్సైజ్‌, అగ్నిమాప‌క‌, జైళ్లు, అట‌వీ శాఖ‌ల‌కు చెందిన ఉద్యోగాల‌కు ఈ వ‌యో ప‌రిమితి వ‌ర్తించ‌నుంది. గరిష్ఠ వ‌యో ప‌రిమితిని మూడేళ్ల‌కు పెంచిన ప్ర‌భుత్వం… ఈ వ‌యో ప‌రిమితి స‌డ‌లింపు రెండేళ్ల పాటు అమ‌ల్లో ఉంటుంద‌ని తెలిపింది.

తెలంగాణలో ఉద్యోగాల జాతర మొదలైంది. 80వేల 039 ఖాళీలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర తొలి విడతగా 30వేల 453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో పోలీస్ శాఖకు సంబంధించి 16వేల 587 ఖాళీల భర్తీ చేయనున్నారు.