Employment in Telangana: తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు: పోలీసు పోస్టులకు వయో పరిమితి పెంపు

విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీతో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి వయో పరిమితి పెంచుతూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు

Employment in Telangana: తెలంగాణ నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు: పోలీసు పోస్టులకు వయో పరిమితి పెంపు

Kcr

Employment in Telangana: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీతో పాటు పోలీస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి వయో పరిమితి పెంచుతూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏ విశ్వవిద్యాలయానికి ఆ విశ్వవిద్యాలయమే సిబ్బంది నియామకాలను చేపట్టే పద్ధతి కొనసాగుతుండగా ఇక నుండి విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాలు ఒకే ఒక నియామక సంస్థ (కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ్) ద్వారా జరపాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధంగా అన్ని విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాన్ని పారదర్శకంగా ఒకే నియామక సంస్థ ద్వారా జరపాలని కేబినేట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 3,500 పై చిలుకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను చేపట్టాలని కేబినేట్ నిర్ణయించింది. దీనితో పాటుగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు జరపబోతున్న విషయం తెలిసిందే.

Also read:GO No: 111 in Hyderabad: జీవో నెంబర్ 111 ఎత్తివేతకు తెలంగాణ కేబినేట్ ఆమోదం: మరి జంట జలాశయాల మాటేమిటి?

పోలీస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి అర్హతలో 3 సంవత్సరాలు సడలించాలని కేబినేట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగార్థుల నుండి వచ్చిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర గెజిటెట్ పోస్టుల నియామకాల్లో పాదర్శకత కోసం ఇక నుంచి కేవలం లిఖిత పరీక్షనే ప్రమాణంగా తీసుకోవాలనీ, ఇంటర్వ్యూ అవసరం లేదనే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాలకే ఐటీ తదితర పరిశ్రమల స్థాపన పరిమితం కాకూడదని, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిపంజేయాలని తద్వారా హైదరాబాద్ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

Also read:CM KCR: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం: రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందన్న సీఎం కేసీఆర్