Google Chrome Update : 2023లో కొన్ని కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అసలే పనిచేయదు.. వెంటనే కొత్త వెర్షన్ అప్‌డేట్ చేసుకోండి!

Google Chrome Update : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ (Google Chrome) 2023 ఏడాదిలో కొత్త వెర్షన్ Chrome 110 రిలీజ్ చేయనుంది. తాత్కాలికంగా ఫిబ్రవరి 7, 2023న క్రోమ్ న్యూ వెర్షన్ చేసేందుకు రెడీగా ఉంది.

Google Chrome Update : 2023లో కొన్ని కంప్యూటర్లలో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అసలే పనిచేయదు.. వెంటనే కొత్త వెర్షన్ అప్‌డేట్ చేసుకోండి!

Google Chrome will stop working on some computers starting 2023, here's all you need to know

Google Chrome Update : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ (Google Chrome) 2023 ఏడాదిలో కొత్త వెర్షన్ Chrome 110 రిలీజ్ చేయనుంది. తాత్కాలికంగా ఫిబ్రవరి 7, 2023న క్రోమ్ న్యూ వెర్షన్ చేసేందుకు రెడీగా ఉంది. కొత్త రిలీజ్‌తో టెక్ దిగ్గజం పాత Chrome వెర్షన్‌లకు సపోర్టును నిలిపివేయనుంది. Google సపోర్టు పేజీ ప్రకారం.. Chrome 109 అనేది రెండు పాత Microsoft ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్టు ఇచ్చే Chrome చివరి వెర్షన్ అని చెప్పవచ్చు. అంతేకాదు.. Windows 7, Windows 8.1 ఆపరేటింగ్ సిస్టమ్‌లలో జనవరి 15, 2023 నాటికి Google Chrome పాత వెర్షన్‌లకు సపోర్టును నిలిపివేస్తుంది.

Chrome కొత్త వెర్షన్ Chrome 110, Windows 10 లేదా ఆపై Chrome ఫస్ట్ వెర్షన్ అని చెప్పవచ్చు. క్రోమ్ యూజర్లు Windows 7, Windows 8.1లో Chrome పాత వెర్షన్ ఉపయోగించగలరు. కానీ, సెక్యూరిటీ అప్‌డేట్స్, మరిన్నింటితో సహా కొత్త Updates పొందలేరు. Chrome 109 అనేది Windows 7, Windows 8/8.1కి సపోర్టు ఇచ్చే Chrome చివరి వెర్షన్. Chrome 110 (తాత్కాలికంగా ఫిబ్రవరి 7, 2023న లాంచ్ కానుంది) Windows 10 లేదా ఆపై అవసరమయ్యే Chrome మొదటి వెర్షన్ అని Google ప్రకటించింది.

టెక్ దిగ్గజం ప్రకారం.. వినియోగదారులు క్రాస్-ప్లాట్‌ఫారమ్ వెబ్ బ్రౌజర్ Chrome వాడాలంటే Windows 10 లేదా 11 OSతో సిస్టమ్‌లను అప్‌గ్రేడ్ చేయాలి. భవిష్యత్తులో Chrome అప్‌డేట్ కొనసాగించడానికి మీ డివైజ్ Windows 10 లేదా ఆ తర్వాత OS ఉండేలా చూసుకోవాలి. Windows 7 ESU, Windows 8.1 Extended Support కోసం జనవరి 10, 2023న Microsoft సపోర్టును ముగించనుంది.

Google Chrome will stop working on some computers starting 2023, here's all you need to know

Google Chrome will stop working on some computers starting 2023

Read Also :  Chrome Desktop Web : గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. క్రోమ్ డెస్క్‌టాప్ వెబ్‌లో న్యూ మోడల్ ఫీచర్లు..!

Chrome పాత వెర్షన్లు ఇంకా పని చేస్తూనే ఉంటాయి. కానీ, ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌లలోని యూజర్లకు మాత్రం ఆ తర్వాత Updates మాత్రమే ఏవీ అందవు. Windows 7, Windows 8/8.1. OSకి సెక్యూరిటీ అప్‌డేట్‌లు ముఖ్యమైనవి. వినియోగదారులు కొత్త విండోస్‌కి అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జూలై, 2021లో అప్‌డేట్ చేసిన Chrome 110 వెర్షన్‌ను రిలీజ్ చేయాలని Google ముందుగా ప్లాన్ చేసింది. మహమ్మారి కారణంగా కంపెనీ Update రిలీజ్ వాయిదా వేసింది.

Chromeను కొత్త వెర్షన్‌తో ఎందుకు అప్‌డేట్ చేయాలంటే? :
లేటెస్ట్ Windows OSతో వెబ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేస్తే.. Chrome ద్వారా లేటెస్ట్ సెక్యూరిటీ అప్‌డేట్స్ పొందడంలో సాయపడుతుంది. డేంజరస్ అటాక్స్, ఐడెంటిటీ థెఫ్ట్, ఫిషింగ్ అటాక్స్, వైరస్‌లు, ట్రోజన్‌లు, స్పైవేర్, యాడ్‌వేర్, ఇతర మాల్వేర్‌లతో సహా ఇతర దాడుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలంటే PCలను తప్పనిసరిగా లేటెస్ట్ అప్‌డేట్‌ చేసుకోవాలి.

అదనంగా, Chromeని అప్‌డేట్ చేస్తే మీ పాస్‌వర్డ్‌లను దొంగిలించే లేదా మీ కంప్యూటర్‌కు హాని కలిగించే ప్రమాదకరమైన, మోసపూరిత సైట్‌ల నుంచి మీ సిస్టమ్‌ను ప్రొటెక్ట్ చేయడంలో వెబ్ బ్రౌజర్ సాయపడుతుంది. సకాలంలో సెక్యూరిటీ ప్యాచ్‌లు, బగ్ పరిష్కారాలతో, మునుపటి అప్‌డేట్‌లలో ఏదైనా లోపం ఉంటే.. Google కొత్త పరిష్కారాలు, అప్‌డేట్స్ కూడా రిలీజ్ చేస్తుంది. ఈ కొత్త అప్‌డేట్‌లు మరిన్ని ఫీచర్‌లతో యూజర్లను ఆకట్టుకునేలా ఉంటాయి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google Chrome Update : గూగుల్ క్రోమ్‌లో కొత్త అప్‌డేట్.. ఇకపై యూజర్లు పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ కావొచ్చు.. అది ఎలా పనిచేస్తుందో తెలుసా?