Google For India : యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త కోర్సులు.. మరెన్నో మానిటైజేషన్ అవకాశాలు.. ఎప్పటినుంచంటే?

Google For India : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) అందించే పాపులర్ సర్వీసుల్లో యూట్యూబ్ (Youtube) ఒకటి. అలాంటి యూట్యూబ్ నుంచి ఎన్నో మానిటైజేషన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. పలు యూట్యూబ్ సర్వీసుల నుంచి కంటెంట్ క్రియేటర్లు డబ్బులను సంపాదించుకునే వీలుంది.

Google For India : యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త కోర్సులు.. మరెన్నో మానిటైజేషన్ అవకాశాలు.. ఎప్పటినుంచంటే?

Google for India_ YouTube announces Courses in India, launch in the first half of 2023

Google For India : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) అందించే పాపులర్ సర్వీసుల్లో యూట్యూబ్ (Youtube) ఒకటి. అలాంటి యూట్యూబ్ నుంచి ఎన్నో మానిటైజేషన్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. పలు యూట్యూబ్ సర్వీసుల నుంచి కంటెంట్ క్రియేటర్లు డబ్బులను సంపాదించుకునే వీలుంది. ఇప్పుడు అదే కంటెంట్ క్రియేటర్ల (Content Creators) కోసం యూట్యూబ్ సరికొత్త కోర్సులను అందించనుంది.

గూగుల్ ఫర్ ఇండియా (Google For India) ఈవెంట్‌లో కొత్త కోర్సులతో సహా మరెన్నో ఆసక్తికరమైన ప్రకటనలను యూట్యూబ్ (YouTube) వెల్లడించింది. ప్రస్తుతం యూట్యూబ్ కొత్త సబ్‌స్క్రిప్షన్ ఆధారిత మోడల్ కోర్సులను కొంతమంది పార్టనర్లు, క్రియేటర్లతో టెస్టింగ్ చేస్తోంది. 2023 ప్రథమార్థంలో కోర్సులను ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. యూట్యూబ్ కోర్సుల కోసం YouTube అధికారికంగా లాంచ్ చేసే నెల లేదా తేదీని వెల్లడించలేదు.

YouTube ఇప్పటికే 8 మానిటైజేషన్ విధానాలను అందిస్తోంది. ప్రస్తుతం గూగుల్ అందించబోయే కోర్సులు రాబోయే నెలల్లో అధికారికంగా ప్రకటించాలని యోచిస్తోంది. గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్‌కు ముందు జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో యూట్యూబ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఇషాన్ జాన్ ఛటర్జీ మాట్లాడుతూ.. భారత్, దక్షిణ కొరియా యునైటెడ్ స్టేట్స్‌తో సహా మూడు దేశాల్లో మాత్రమే ఈ కొత్త కోర్సులు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

Read Also : YouTube Premium Membership : రూ. 10లకే మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం మెంబర్‌షిప్.. లిమిటెడ్ ఆఫర్.. డోంట్ మిస్!

డిజిటల్ లెర్నింగ్ స్పేస్‌లో భారత్ అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటిగా ఉందని ఛటర్జీ అభిప్రాయపడ్డారు. రాబోయే నెలల్లో యూట్యూబ్ కొత్త కోర్సులు ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు. YouTube వినియోగదారులకు సరైన కంటెంట్‌ను అందించడంలో సులభమైన పద్ధతిలో తమ స్కిల్స్ పెంచుకోవడంలో సాయం చేయాలని కంపెనీ భావిస్తోంది. డిజిటల్ లెర్నింగ్‌లో తమ కంటెంట్‌ను మానిటైజ్ చేయాలా వద్దా అనేది కంటెంట్ క్రియేటర్లపై ఆధారపడి ఉంటుందని ఛటర్జీ చెప్పారు.

Google for India_ YouTube announces Courses in India, launch in the first half of 2023

Google for India_ YouTube announces Courses in India, launch in the first half of 2023

వీక్షకులకు నైపుణ్యాన్ని పెంచేందుకు వీడియోల నుంచి మానిటైజేషన్ బెనిఫిట్స్ (monetization benefits) కోరుకునే వారికి త్వరలో ఆ ఆప్షన్ ఉంటుందని ఛటర్జీ తెలిపారు. YouTube అందించబోయే కోర్సుల ద్వారా కంటెంట్ క్రియేటర్లు తమ డిజిటల్ నైపుణ్యాలు, వ్యవస్థాపకత, వృత్తి, వ్యక్తిగత అభిరుచి వంటి నాలుగు రంగాల్లో పొందవచ్చు. వీడియోలతో పాటు, YouTube క్రియేటర్లు PNG, PDF ఫార్మాట్‌లో డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసేందుకు అనుమతిస్తుంది. యూట్యూబ్ అందించబోయే కోర్సుల ద్వారా క్రియేటర్లకు వివరణాత్మక వివరణను అందించాలని భావిస్తోంది.

యూట్యూబ్ రానున్న కొత్త కోర్సులతో కంటెంట్ క్రియేటర్లకు త్వరలో మరిన్ని మానిటైజేషన్ అవకాశాలను అందించాలని కోరుకుంటోందని యూట్యూబ్ డైరెక్టర్ సౌత్ ఈస్ట్ ఏషియా & ఎమర్జింగ్ మార్కెట్స్ అజయ్ విద్యాసాగర్ తెలిపారు. యూట్యూబ్‌లో భారత్ క్రియేటర్లకు ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేయడంతో పాటు దేశమంతటా కొత్త ఉద్యోగాలు, అవకాశాలను అందించనున్నట్టు తెలిపారు.

యూట్యూబ్ ప్రేక్షకుల ద్వారా అనేక భాషల్లో తమ కంటెంట్ క్రియేటర్లు ఆదాయాన్ని పెంచుకోవచ్చునని తెలిపారు. 2021లో యూట్యూబ్ క్రియేటివ్ ఎకోసిస్టమ్ భారతీయ GDPకి రూ. 10వేల కోట్లకు పైగా అందించిందని చెప్పారు. 2021లో భారత్‌లో 750,000 కన్నా ఎక్కువ ఫుల్-టైం సమాన ఉద్యోగాలకు సపోర్టు అందించిందని విద్యాసాగర్ వెల్లడించారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : YouTube : యూట్యూబ్‌లో బిగ్ అప్‌డేట్.. పించ్-టు-జూమ్ ఫీచర్.. మీరు వీడియోను జూమ్ చేసి చూడవచ్చు..!