Google Apprenticeship Programme : హైదరాబాద్‌లో గూగుల్ కొత్త ప్రోగ్రామ్‌.. మీ స్కిల్స్ పెంచుకునేందుకు ఇదే ఛాన్స్!

ఐటీ రంగంపై ఆసక్తి ఉందా? ఐటీ రంగంలో మీ టెక్నికల్ స్కిల్స్ మెరుగుపర్చుకోవాలనుకుంటున్నారా? ఇదే సరైన సమయం.. ఐటీ రంగంలో రాణించాలని అనుకునేవారి కోసం గూగుల్ కొత్త ఆఫర్ అందిస్తోంది.

Google Apprenticeship Programme : హైదరాబాద్‌లో గూగుల్ కొత్త ప్రోగ్రామ్‌.. మీ స్కిల్స్ పెంచుకునేందుకు ఇదే ఛాన్స్!

Google Offering Apprenticeship Programme In Hyderabad

Google Apprenticeship Programme : ఐటీ రంగంపై ఆసక్తి ఉందా? ఐటీ రంగంలో మీ టెక్నికల్ స్కిల్స్ మెరుగుపర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఇదే సరైన సమయం.. డోంట్ మిస్ ది ఛాన్స్.. ఐటీ రంగంలో రాణించాలని అనుకునేవారి కోసం సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ కొత్త ఆఫర్ అందిస్తోంది. ప్రత్యేకించి హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో అప్రెంటిస్‌షిప్ ప్రొగ్రామ్ అనే ఈ కొత్త ప్రొగ్రామ్ (apprenticeship programme) ఆఫర్ చేస్తోంది. డిజిటల్ మార్కెటింగ్, డేటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ లేదా ఐటీ వంటి రంగాల్లో మీ స్కిల్స్ మెరుగుపర్చుకోవచ్చు.

యూనివర్సిటీ డిగ్రీని పూర్తి చేసిన అభ్యర్థుల కోసం ఈ కొత్త అప్రెంటిస్‌షిప్ ప్రొగ్రామ్ ఆఫర్ చేస్తోంది గూగుల్. ఈ కొత్త ప్రొగ్రామ్ ద్వారా తమ కెరీర్‌ను కిక్‌స్టార్ట్ చేసుకోవాలనుకునేవారికి ఇదో మంచి అవకాశం. అప్రెంటిస్‌షిప్ ప్రొగ్రామ్ ద్వారా మీరు ఎంచుకున్న రంగంలో అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. మీ టెక్నికల్ స్కిల్స్ మరింత మెరుగుపర్చుకోవచ్చు. ఇంతకీ Google అప్రెంటిస్‌షిప్‌ను ప్రొగ్రామ్ ఏయే ఫీల్డ్‌‌లో ఎలాంటి ఆఫర్ చేస్తోందో తెలుసుకుందాం.. మీకు ఆసక్తి ఉంటే.. ఆయా రంగాల్లో ఈ కొత్త ప్రొగ్రామ్ నేర్చుకునేందుకు వెంటనే అప్లయ్ చేసుకోండి.

Digital Marketing Apprenticeship :
డిజిటల్ మార్కెటింగ్‌లో ఏడాది కంటే తక్కువ అనుభవం కలిగి ఉన్న ఏ గ్రాడ్యుయేట్ అయినా దీనికి అప్లయ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్ మార్చి 2022లో ప్రారంభం కానుంది. అప్లయ్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 2. హైదరాబాద్, బెంగళూరు, గురుగ్రామ్ ప్రాంతాల్లో ఈ అప్రెంటిస్‌షిప్ ప్రొగ్రామ్ అందుబాటులో ఉంటుంది. ఈ లింక్ ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
Click Here : https://careers.google.com/jobs/results/114635695642813126-digital-marketing-apprenticeship-march-2022-start/

Data Analytics Apprenticeship :
మీకు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ (Excel), Google Sheets గురించి అవగాహన ఉందా? ఈ రెండింటిలో మీ స్కిల్స్ మరింత మెరుగుపర్చుకోవాలని అనుకుంటున్నారా? మీరు ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేసి ఉంటే వెంటనే అప్లయ్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ మార్చి 2022లో ప్రారంభం కానుంది. ఇక అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 2. హైదరాబాద్, ముంబై, బెంగళూరు గురుగ్రామ్ ప్రాంతాల్లో ఈ ప్రొగ్రామ్ అందుబాటులో ఉంటుంది. ఈ లింకు ద్వారా అప్లయ్ చేసుకోవచ్చు.
Click Here : https://careers.google.com/jobs/results/143146032151044806-data-analytics-apprenticeship-march-2022-start/

Project Management Apprenticeship :
ఈ ప్రొగ్రామ్ నేర్చుకోవాలనుకుంటే.. మీరు ఏదైనా ఏదైనా గ్రాడ్యుయేట్ లేదా MBA పూర్తి చేసి ఉండాలి. ఈ ప్రోగ్రామ్ కోసం వెంటనే అప్లయ్ చేసుకోండి. ఈ అప్రెంటిస్‌షిప్ ప్రొగ్రామ్ వ్యవధి రెండు సంవత్సరాలు (24 నెలలు) ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ మార్చి 2022లో ప్రారంభమవుతుంది. అప్లయ్ చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ 2. హైదరాబాద్, బెంగళూరు గురుగ్రామ్ ప్రాంతాల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. ఈ లింక్ ద్వారా వెంటనే అప్లయ్ చేసుకోండి.
Click Here : https://careers.google.com/jobs/results/82975258321003206-project-management-apprenticeship-march-2022-start/

Information Technology Apprenticeship :
ఈ ప్రొగ్రామ్ వ్యవధి ఏడాది (12 నెలలు) ఉంటుంది. ఏదైనా గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉంటే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్రెంటిస్‌షిప్ ప్రొగ్రామ్ మార్చి 2022లో ప్రారంభమవుతుంది. ఇక అప్లయ్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 2 వరకు మాత్రమే ఉంది. ఈ ప్రోగ్రామ్ హైదరాబాద్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ లింక్ ద్వారా వెంటనే అప్లయ్ చేసుకోండి.
Click Here : https://careers.google.com/jobs/results/96944956741952198-information-technology-apprenticeship-march-2022-start/